బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హింది బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. జిస్మ్ 2 చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది. హిందీ, తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనకంటూ అభిమానులను సొంతం చేసుకొని వారిని అలరిస్తూ వస్తుంది. తాజాగా సన్నీ లియోన్ కోసం ఓ అభిమాని ఏకంగా చికెన్ డిస్కౌంట్ లో పెట్టాడు.
సాధారణంగా తాము అభిమానించే నటుల కోసం అభిమానులు దేనికైనా సిద్దపడుతుంటారు. కొంత మంది ఏకంగా గుడి కట్టించి పూజలు కూడా చేస్తుంటారు. తాజాగా ఈ ముద్దు గుమ్మ కోసం ఒక వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకకు చెందిన ఒక ప్రసాద్ అనే వ్యక్తికి ఒక చికెన్ షాపు ఉంది. తన షాపులో సన్నీలియోన్ ఫ్యాన్స్ కి పది శాతం డిస్కౌంట్ ఏర్పాటు చేశారు.. కాకపోతే కొన్ని కండీషన్లు పెట్టాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సన్నీలియోన్ అకౌంట్స్ ఫాలో కావాలన్నాడు.
ఎవరైతన తన చికెన్ షాప్ లో చికెన్ కొని డిస్కౌంట్ పొందాలని అనుకుంటున్నారో.. తప్పని సరిగా ఆమెకు సంబంధించిన ఫోటోలు, అప్ డేట్స్ ఫాలో కావాలని సూచిస్తున్నాడు. ఇంకేముంది హాట్ బ్యూటీ సన్నీలీయోన్ అభిమానులంతా ఆ షాప్ కు క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.