Brother Gift: అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు చుట్టాలు, పెళ్లికూతరు తరపు చుట్టాలు, తల్లిదండ్రులు, పిల్లలతో పెళ్లిమండపం సందడిగా ఉంది. డ్యాన్సులు, ఆటలు.. పాటలతో అందరూ హుషారుగా ఉన్నారు. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఆమె మనసులో మాత్రం ఏదో తీరని లోటు. పెళ్లిపందిరిలో ఒకరు లేరనే ఆలోచన. మనసులోని బాధను బయటికి కనిపించకుండా దాచుకుంది. తనలోనే కాదు.. అందరిలోనూ అదే ఆవేదన. చెల్లి.. బాధను అర్థం చేసుకున్నాడు ఆ అన్న. నాన్నలో సగమైన తాను.. చెల్లికి ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే, చెల్లి పెళ్లికి నాన్నని అనుకోని అతిథిలా తీసుకొచ్చాడు. చెల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఆమెను సర్ప్రైజ్ చేశాడు. తండ్రి మైనపు బొమ్మతో.. చెల్లినే కాదు.. తల్లిని కూడా ఆశ్చర్యపరిచాడు.
పెళ్లిమండపంలో నాన్నను చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడ్చేసింది. పెళ్లికి నాన్నలేడని తన గుండెలో దాచుకున్న బాధను ఒక్కసారిగా.. ఆనంద భాష్పాల రూపంలో వెల్లబుచ్చింది. లేడనుకున్న నాన్న, తన పెళ్లికి రాడనుకున్న నాన్న.. పెళ్లికి వచ్చి తనని ఆశీర్వదించడంతో ఎగిరిగంతేసింది. తండ్రిని పట్టుకుని.. ఏడ్చేసింది. తన బాధను చూసి దేవుడే నాన్నను పంపాడని, గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అయ్యింది. పెళ్లికూతరే కాదు.. అక్కడ ఉన్న ప్రతి ఒకరు ఎమోషనల్ అయ్యారు. పెళ్లికూతురి తల్లి తన భర్త విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కూతురి పెళ్లిలో భర్త లేడనే ఆవేదన తీరడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కాదు పెళ్లిమండపంలోని ప్రతిఒకరు ఎమోషనల్ అయ్యారు. విగ్రహాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. మా కోసం మళ్లీ తిరిగొచ్చావా అంటూ ఎమోషనల్ అయ్యారు.
” ఇప్పటివరకు ఒకరు లేరనే లోటు కనిపించింది.. ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చారు.. ఇక ఇక్కడ నుంచి పండగే” అంటూ పెళ్లికూతురు అన్న చెప్పిన మాటలు విన్న ప్రతిఒకరు ఏడ్చేశారు. వాళ్లకోసమే ఆయన తిరిగొచ్చాడన్నట్లుగా ఆ విగ్రహంతో ఫొటోలు దిగుతూ అక్కడివారు ఎమోషనల్ అయ్యారు. తన పెళ్లికి అంతమంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆ చెల్లి.. అన్నయ్యను పట్టుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత అందరూ.. గ్రూప్ ఫొటోలు దిగి.. ఆనందపడ్డారు. తండ్రి లేడనే లోటు లేకుండా.. తన పెళ్లిఫొటోల్లో నాన్న లేడనే బాధలేకుండా ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్లిఉంటుంది. కూతురికి నాన్నతో ఉండే ఎమోషన్ ఎవరూ వర్ణించలేనిది.
అన్ని విషయాల్లో తండ్రి తనతో తోడు ఉంటాడనే ధైర్యంతో ఉంటుంది. అలాంటిది ఆ తండ్రే లేకపోతే.. కూతురు తల్లడిల్లిపోతుంది. జీవితంలో జరిగే ముఖ్య విషయాల్లో తండ్రి లేకపోతే అల్లాడిపోతుంది. అలాంటిది లేడనుకున్న నాన్న.. తన పెళ్లికి రావడంతో ఎంతో ఆనందపడింది. ఆనందంతో ఏడ్చేసింది. ఎగిరిగంతేసింది. నాన్నని ముద్దాడింది. నాన్నలో సగం అంటారు అన్న.. చెల్లి బాధను అర్థం చేసుకున్న అన్న ఇచ్చిన ఆ సర్ప్రైజ్ చెల్లికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ అన్నాచెల్లెల అనుబంధం ఎప్పటికే ఇలానే ఉండాలని కోరుకుందాం. మీరు కూడా మీ ఆశీస్సులను కామెంట్స్ రూపంలో చెప్పండి.
ఇవి కూడా చదవండి : Free Biryani: బంపరాఫర్ కొట్టేసిన మహిళ.. ఏడాది పాటు ఉచితంగా ప్యారడైజ్ బిర్యానీ!