బ్రిటన్‌లో మరో కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. AY 4.2 వేరియంట్ బ్రిటన్‌ను వణికిస్తోంది. ఇప్పుడు ఆ రకం కేసులు తెలంగాణలోనూ వెలుగు చూడడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ మూడో వేవ్ రాబోతోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ విషయం బయటపడింది. ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ జరిగింది. బ్రిటన్ వేరియంట్ వివరాలను డబ్యూహెచ్‌వో ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్షియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 26 వేల AY 4.2 కేసులు జీఐఎస్‌ఏఐడీలో నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. గత నెలలో తెలంగాణలో నమోదైన కరోనా కేసులకు సంబంధించిన 274 మంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా 0.6 శా4తం AY 42 రకం కేసులు ఉన్నట్లు తేలింది.
ఇదీ చదవండి: పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో తెలీదు షాకింగ్ నిర్ణయం..
తెలంగాణలో ఏవై 4.2 వేరియంట్ కేసులు వచ్చిన వ్యక్తుల వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎలాంటి వివరాలు లేవు. డెల్టా వేరియంట్ సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనూ రెండో దశలో డెల్టా వేరియంట్‌తో వేలాది మంది ఎఫెక్ట్ అవ్వగా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏవై 4.2 కూడా ఆ వర్గానికి చెందినదే. డెల్టా వేరియంట్‌లో మొత్తం 3 ఉప వర్గాలున్నాయి. మళ్లీ ఉప వర్గాల్లో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఏవై 4.2 రకం. ఇందులో మరో వణికించే వార్త ఏంటంటో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఈ ఏవై 4.2 రకం 12 శాతం అధికంగా వ్యాప్తి చెందగలదని ఇప్పటికే నిర్ధారించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. మరణాలు మాత్రం పెద్దగా లేవంటూ డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం ఒకింత ఊరటనిచ్చే అంశం. AY 4.2 వేరియంట్ కేసులు తెలంగాణలో ఇంకా ఎన్ని ఉండే అవకాశం ఉందనే వాదన చర్చనీయాంశంగా మారింది. ఎందుకైనా అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.