ప్రస్తుతం పెరగుతున్న నిత్యావసర ధరలు చూసి సామాన్యులు షాక్ గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని రకాల ఆహార ఉత్పత్తుల ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. త్వరలో బ్రెడ్, బిస్కెట్లు, పిండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం నిరంతరం పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు ,ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గోధమల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటి వరకు గోధుమ ధరలు 46శాతం పెరిగాయి.
అంటే ప్రస్తుతం గోధుమలు మార్కెట్ లో MSP కంటే 20 శాతం ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. ఓపెన్ మార్కెట్ సేల్ (OMS)స్కీమ్ కింద రెగ్యులర్ బేసిస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) గోధుమలను మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ద్వారా సరఫరాను పెంచి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభించేలా చేస్తుంది. గోధుమల లీన్ సీజన్‌లో ఓపెన్ మార్కెట్ ధరలను నియంత్రించేందుకు ఓఎంఎస్ఎస్ ను ప్రభుత్వం వాడుతోంది. అయితే ఈ ఏడాది ఎఫ్ సీఐ గోధుమల కోసం ఓఎమ్ఎస్ ను ప్రకటించలేదు.
దీంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు, కంపెనీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రుతుపవనాల కాలంలో స్నాక్స్ వంటి వాటికి డిమాండ్ ఉండటంతో..ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి గల కారణం రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయంలో విద్యా సంస్థలు కూడా ప్రారంభమవుతాయి. ఆ సమయంలో బ్రెడ్, బిస్కెట్ వంటి స్నాక్స్ ఐటమ్స్‌కు డిమాండ్ పెరుగుతుంది.మరి.. ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.