ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. పదుల సంఖ్యల్లో వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ చిన్నారి ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడ్డారు.. చనిపోయారు.
దేశంలో వరుస కుక్కల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా బయట ఆడుకుంటున్నా.. నడుచుకుంటూ వెళ్తున్నా దాడులకు తెగబడుతున్నాయి. గుంపులుగా వచ్చి పిల్లలపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో కొన్నిసార్లు చిన్నారులు చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారిని కుక్కలు దాడి చేసి దారుణంగా కరిచి చంపాయి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఓ బాలుడిపై కొన్ని వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి.. చిన్నారిని ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకు వెళ్లాయి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ నాలుగేళ్ల బాలుడు వీధి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అకస్మాత్తుగా కొన్ని కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. బాలుడి తల్లి వెంటనే స్పందించి రాళ్లతో కుక్కలను తరిమివేసింది. దీంతో గాయాలతో బాలుడు ప్రాణాలతో బతికిపోయాడు. వాస్తవానికి ఈ నెల 11న ఘటన జరిగినప్పటికే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నాగ్ పూర్ లో ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. సీసీ టీవీలో రికార్డు అయిన దృష్యాలో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇక వీడియో ప్రకారం.. ఓ బాలుడు రోడ్డుపై మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు. మొదట ఓ కుక్క అతనిమీదకు వెళ్లింది.. ఆ తర్వాత వరుసగా కుక్కలు ఆ చిన్నారిపై దాడి చేసి కొంత దూరం లాక్కెళ్లాయి.
అప్పటికే బాలుడు కేకలు వేయడంతో అతని తల్లి వచ్చి కర్ర, రాళ్లతో కుక్కలను తరిమివేసింది. దాంతో బాలుడిని వదిలేసి కుక్కలు వెళ్లిపోయాయి. అప్పటికే ఆ బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. దేశంలో పలు చోట్ల కుక్కల దాడులు పెరిగిపోయాయి.. ఇటీవల ఛత్తీస్ గఢ్ లోని కొరియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. గత నెలలో ఢిల్లీ వసంత్ కుంజ్ లో కుక్కల దాడిలో ఇద్దరు చనిపోయారు. ప్రతిరోజూ కుక్కల దాడులు ఎంతో మంది గాయపడటం.. చనిపోవడం జరుగుతుందని.. వీటి భారి నుంచి రక్షించండి అంటూ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలుడిపై కుక్కల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
4 years old boy injured who was attacked by a pack of Stray in #Nagpur,#Maharashtra.
More than 6 stray dogs attacked the child, the child was badly injured…#CCTV video of #stray dogs attacking.. pic.twitter.com/stfxDcF1Er
— Indrajeet chaubey (@indrajeet8080) April 13, 2023