దేశంలోని సామన్య ప్రజలకు మరో షాక్ తగలనుంది. అవును మీరు విన్నది నిజమే. ఇప్పటికే భారీగా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువులతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలతో సతమతమై చాలి చాలని జీతంతో వారీ జీవితాలను ఈడ్చుకుంటూ వస్తుంటే మారోసారి అగ్గిపెట్టె ధర పెంచనున్నట్లు తయారి ధారులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతానికి అగ్గిపెట్టె ధర రూ.1 పలుకుతోంది. ఇదే ధరను డిసెంబర్ నుంచి రూ.2 పెంచనున్నట్లు తయారిధారులు తెలిపారు. అయితే గతంలో అగ్గిపెట్టె ధరను చూసుకున్నట్లైతే.. 2007లో అర్ధరూపాయి నుంచి రూపాయి వరకు పెరిగింది. దీంతో మరోసారి ఉన్న ధరను మళ్లీ రెట్టింపు చేస్తుండటంతో ప్రజలు అగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో పాటు ఇంధన ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఇక భారీగా పెరుగుతున్న నిత్యవసర ధరలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.