భారతీయ దిగ్గజ వ్యాపారుల్లో ఒకరు మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా. సృజనాత్మకత ఎక్కడ ఉన్నా దాన్ని ఆయన స్టైల్లో ప్రశంసిస్తూ ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించి వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలు.. వీడియోలు నెటిజన్లకు షేర్ చేస్తుంటారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది… ఆయన చేసే పోస్టులకు విశేష స్పందన వస్తుంటుంది. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించారు.. ఏకంగా ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లు దాటేసింది.
సాధారణంగా పారిశ్రామికవేత్తలకు సమయం ఎంతో విలువైందిగా భావిస్తుంటారు.. తమ వ్యాపారాభివృద్ది కోసం అహర్శిశలూ శ్రమిస్తూనే ఉంటారు. కానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాత్రం ఇందికు భిన్నంగా ఉంటారు. ఆయన వ్యాపారాల్లో చురుకైన పాత్ర వహిస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రపంచలో ఎన్నో వింతలు, విశేషాలు.. ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆయన చేసే ప్రతి పోస్ట్ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.. కోట్ల మంది ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో రికార్డు సృష్టించారు.. ఆయన ఫాలోవర్లు కోటికి చేరారు.
ట్విట్టర్ లో కోటి మంది ఫాలోవర్లు ఉండటపై ఆనంద్ మహీంద్రా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘నిజంగా ఇంత పెద్ద కుటుంబం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా.. ఇది ఒకరకంగా కుటుంబ నియంత్రణ ఉల్లంఘనే అవుతుంది.. మీరు నా పట్ల ఉంచిన నమ్మకం..అభిమానాన్నికి ఎప్పుడూ కృతజ్ఞుడిని.. నాతో కనెక్ట్ అయి ఉండండి’ అంటూ ఫన్నీగాగా ట్విట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ట్విట్ పై నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I
— anand mahindra (@anandmahindra) November 10, 2022