దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ దానితో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన సొంతగా ఓ పాట అల్లుకొని విధుల్లో పాడుతూ తన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఆ పాట ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది.
ఇప్పుడు అదే తరహాలో ఒక కొత్త పాట ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రోడ్డు మీద తోపుడు బండిపై జామకాయలు అమ్ముకునే ఓ వ్యక్తి పాడిన జింగిల్ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘యే హరి హరి, కచ్చి కచ్చి, పీలీ పీలీ, పాకీ పాకీ, మీఠీ మీఠీ, గద్దర్ గద్దర్, తాజా తాజా, నమక్ లగా కే ఖాజా ఖాజా’అంటూ జామ పండ్లను ప్యాకెట్ లో వేస్తూ ఉన్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో మొదట యూట్యూబ్‌లో షేర్ చేయగా, తర్వాత ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటి వరకు కచ్చా బాదాం అంటూ కేకలు పుట్టించారు.. ఇప్పుడు కచ్చా జామకాయ్ కొత్త పాట ఏ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. లాటెంల్, అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారన్న విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.