Hanuman Idol: దేశంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంతమంది హిందువులు పలుచోట్ల ఉపవాసంలో ఉంటున్న ముస్లిం సోదరులకు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో హనుమాన్ జయంతి సందర్బంగా కొందరు ముస్లిం సోదరులు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ, ముస్లిం భాయిభాయి అని చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమంది దుండగులు రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ హనుమాన్ విగ్రహానికి 786 పేరిట ఉర్ధూ అక్షరాల చీటీని అతికించారు. ఈ సంఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, కోట జిల్లాలోని అయన గ్రామంలో రాథే శ్యామ్ వైష్ణవ దేవాలయం ఉంది.
ఈ దేవాలయంలో ఓ చిన్న హనుమాన్ గుడి కూడా ఉంది. కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హనుమాన్ గుడిలోకి చొరబడ్డారు. దేవుడి విగ్రహంపై ఉర్ధూ అక్షరాలు ఉన్న చీటీని అతికించారు. దానిపై 786 అని కూడా రాసి పెట్టారు. ఉదయం గుడికి వచ్చిన పూజారి హనుమాన్ విగ్రహంపై చీటీ ఉండటం గమనించాడు. వెంటనే ఊర్లో జనానికి సమాచారం ఇచ్చాడు. ఆ వెంటనే పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది. అక్కడకు చేరుకున్న పోలీసులు చీటీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊర్థూలో ఉన్న అక్షరాలకు అర్థం ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#NavneetRana#Kota “अयाना में हनुमान जी की प्रतिमा पर चिपकाई उर्दू लिखी पर्ची”
हमारे अराध्य पर ही चिपका दी पर्चियां।@KapilMishra_IND @AshokShrivasta6@spkotarural क्या एक्शन हुआ साहब? pic.twitter.com/1js5ifOzZ4— Sujeet Swami️ (@shibbu87) April 24, 2022
ఇవి కూడా చదవండి : ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్.. 14 రోజులు రిమాండ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.