ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడూ అని అంటారు. ఈ రెండూ ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం.. మన జీవితంలో సొంత ఇంటిని సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సొంత ఇంటి కల అనేది ఎంతో కష్టంగా ఉంది. అయితే ఓ వ్యక్తికి తనకంటూ ఓ సొంత ఇళ్లు ఉండాలని నిర్ణయించుకున్నాడు.. సొంతింట కల సాకారం చేసుకోవాలన్న అతని సంకల్పం. కానీ దానికి సరిపడ డబ్బు లేదు.. అయితే ఉన్న కాస్త స్థలంలోనే ఓ అసాధారణ భవనం కట్టేసి, ఔరా అనిపించారు ఆ దంపతులు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవైన స్థలంలో ఐదంతస్తుల ఇల్లు నిర్మించారు. వివరాల్లోకి వెళ్తే..
బిహార్ ముజఫర్పుర్ జిల్లా గన్నీపుర్కు చెందిన సంతోష్, అర్చన భార్యాభర్తలు. వారు దాచుకున్న డబ్బుతో చాలా ఏళ్ల క్రితం ఓ చిన్న స్థలం కొన్నారు. దాని పరిమాణం.. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు మాత్రమే. అంత చిన్నపాటి స్థలంలో ఇల్లు కట్టలేరు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతుంది.. దానికి అనుగుణంగా ఓ చక్కటి ఆలోచన ఆలోచించారు. బాగా ఆలోచించి 2012లో ఓ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం ఓ ఇంజినీరు సాయం కూడా తీసుకున్నారు. 2015 నాటికి నిర్మాణం పూర్తిచేశారు.
ఇది చదవండి: ప్రాణం తీసిన సిగరెట్.. ఇలా కూడా జరుగుతుందా..?
45 అడుగుల పొడవులో దాదాపు సగం మెట్లకే కేటాయించారు. మిగిలిన సగంలో చిన్న గదులు నిర్మించారు. ఆ ఇంటిని కాస్త మోడ్రన్ గా నిర్మించారు. అంతే కాదు ఆ ఇంటిని కంప్యూటర్ సెంటర్ కోసం అద్దెకు ఇచ్చారు. మొత్తానికి సొంతింట కల సాకారం చేసి, అద్దె రూపంలో అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ ఇల్లు గన్నీపుర్కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల కాస్త అదనపు హంగులు అద్ది.. ఈ భవనం ద్వారా ఆదాయం సంపాదించడమూ మొదలుపెట్టారు సంతోష్-అర్చన. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.