సమాజంలో కొన్ని కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను చూస్తే కొన్ని సార్లు నవ్వాపుకోలేం కూడా. అలాంటి విచిత్రమైన వింత ఘటన ఒకటి హర్యానా రాష్ర్టంలో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని బతికుండాగనే రికార్డుల్లో చంపేశారు. దీంతో అతడికి వచ్చే పెన్షన్ ఆగిపోయింది. దాంతో అతడు బతికున్నానని నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. అమ్మ ముసలోడా భలే బుద్ధి చెప్పావ్ అధికారులకు అంటూ నెటిజన్స్ ఆ ముసలి తాతను పొగుడుతున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దులీచంద్.. హర్యానా రాష్ట్రం రోహ్ తక్ సమీపాన గల గంద్రా గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడికి 102 ఏళ్లు. అయితే అసలు విషయం ఏంటంటే ఇతనికి మార్చి నెల నుంచి వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం అధికారులు నిలిపి వేశారు. దీంతో కారణం ఏంటా అని తెలుసుకోవడానికి కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు చెప్పిన విషయం విని కంగుతిన్నాడు దులీచంద్. అప్పడికే అతడు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు అయినట్లు వారు తెలిపారు. అయితే దులీచంద్ తాను బతికున్న విషయాన్ని అధికారులకు ఎలాగైనా తెలియజేయాలనుకున్నాడు. దానికి ఒక వింతైన, వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేంటంటే? అతడు 102 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకులా మారిపోయాడు. వరుడు పెళ్లి బరాత్ లో ఎలా ఉంటాడో అలా తయ్యారు అయ్యి గుర్రపు బండి ఎక్కి బ్యాండ్ తో ఊరేగింపు చేశాడు.
తన మద్దతు దారులతో కలిసి ఊరేగింపు నిర్వహించాడు. మద్దతుదారలు డ్యాన్స్ చేస్తూ ప్లకార్డులు ధరించారు. వాటిపై ” మీ మామ ఇంకా బతికే ఉన్నాడు” అని రాశారు. ఇంతటి హంగామా చూసైనా నాక్ పెన్షన్ ఇవ్వాలని దులీచంద్ అధికారులను కోరాడు. ఇక ఈ విషయంపై కొందరు రాజకీయ నాయకులు సైతం స్పందించారు. అతడికి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి పెన్షన్ కోసం ఇంతటి విచిత్రమైన దారి కనుక్కున్న వృద్దున్ని చూసి.. నెటిజన్స్ “ముసలోడే కానీ మహానుభావుడు” అనుకుంటున్నారు. మరి ఈ వృద్దుడు వినూత్న నిరసనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है
अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय )
निर्माता निर्देशक, नवीन जयहिंद
गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक
कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh— Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022