కస్టడీ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా ద్వారా తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు . కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేశాడు నాగ చైతన్య. పలు ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాలతో పాటు తన డివోర్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు.
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్య. కస్టడీ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు చై. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు మ్యూజిక్ అందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేశాడు నాగ చైతన్య. పలు ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాలతో పాటు తన డివోర్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు ప్రేమతో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయన.. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
కస్టడీ మూవీ అనేది నిజాన్ని వెలికితీసేందుకు ఎంత దూరమైనా వెళ్లే ఓ పోలీసు కథ అని చై తెలిపారు. ఇది కేవలం యాక్షన్ ఫిల్మ్ కాదని, అన్ని లేయర్స్ ఉన్నాయన్నారు. ఏ మాయ చేశావో నుండి వెంకట్ ప్రభుతో పరిచయం ఉందని, అయితే ఇటీవల హైదరాబాద్ వచ్చి కస్టడీ లైన్ చెప్పారు. లవ్ స్టోరీ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చి తనను ఎంచుకున్నారని పేర్కొన్నారు. ఒక ఇన్నోసెంట్ కానిస్టేబుల్ ఎలా రేయిజ్ అయ్యాడో చూపించడమే ఈ కథ అని చెప్పారు. అలాగే వెంకట్ ప్రభు తెలుగు సినిమా చేయాలనుకున్నాడు.. తాను కూడా తమిళ పరిశ్రమకు పరిచయం కావాలని అనుకున్నానని చెప్పారు. కంటీన్యూస్ ఫెయిల్యూర్స్ పై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే.. ఎందుకు బతికి ఉన్నారా అనిపిస్తుంటుందని అన్నారు. అలాగే సక్సెస్ వచ్చినప్పుడు కూడా వాళ్లే పైకి తీసుకెళ్లి కూర్చొబెడతారని అన్నారు. ప్రతి శుక్రవారం మొత్తం డిసైడ్ అవుతుందని పేర్కొన్నారు.
పర్సనల్, ఫ్యామిలీ లైఫ్ గురించి వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ.. తన గురించి, సినిమాల గురించి ఎంత మాట్లాడినా పట్టించుకోను కానీ, ఎప్పుడు ఫ్యామిలీకి లింక్ చేస్తారో, ఒక థర్డ్ పార్టీని తీసుకువచ్చి.. తన లైఫ్‌లోకి, తన న్యూస్ కి ఇన్వాల్ చేస్తే ఏదో స్పెక్యులేట్ చేసి, వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఫీల్ అవుతానని చెప్పారు. మీడియా రిపోర్టింగ్ అంత లో లెవల్‌కి వెళ్లిందా అంటూ ప్రశ్నించారు. న్యూస్ అనేది ప్రజలకు చేరువ చేసేలా ఉండాలి కానీ, మానిప్యులేట్ చేయకూడదన్నారు. గత రెండేళ్లలో తన లైఫ్‌లో ఏదైతే జరిగిందే అది అనుకోకుండా జరిగిందేనన్నారు. మా మ్యారేజ్ లైఫ్.. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ చాలా రెస్పెక్ట్ ఉందన్నారు. కానీ తన డివోర్స్ పై రకరకాలకు రూమర్లు క్రియేట్ చేసి.. పబ్లిక్ మైండ్స్ లో నెగిటివిటీ తీసుకు వస్తున్నారన్నారు.
‘సమంత, నేను విడాకులు తీసుకుని ఏడాది గడిచిపోయింది. ఇద్దరి సమ్మతితోనే విడాకులు తీసుకున్నాం. జస్ట్ హెడ్ లైన్స్ కోసం మన పేర్లను పెట్టి, మూడో వ్యక్తిని ఎటాచ్ చేసి, తప్పుగా మాట్లాడి, వాళ్ల ఫ్యామిలీని ఇన్వాల్ చేసింది మీడియా. ఇది నాకు బాధగా అనిపించింది. వారు తప్పులేకుండా మూడో వ్యక్తిని తీసుకురావడం తప్పు. మాది రెండేళ్లుగా క్రితమే ముగిసిన కథ. మేము మూవ్ ఆన్ అయిపోయాం. వీళ్లేందుకు(ప్రజలు) మూవ్ అన్ అవ్వడం లేదో. నేనిచ్చిన క్లారిఫికేషన్ తో డివోర్స్ టాపిక్ క్లోజ్ చేస్తారనుకుంటున్నా. రియల్ ఇష్యూ గురించి మాట్లాడండి. అయిపోయిందేదో అయిపోయింది. నేను, సామ్ కలిసి స్టేట్ మెంట్ ఇచ్చాం. కానీ మూడో పార్టీని తీసుకురావడం తప్పు’అని చెప్పారు. అందుకే ఈ విషయం చెప్పానన్నారు.
అదేవిధంగా తనతో పనిచేసిన డైరెక్టర్ల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దూత వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఇది గ్రే క్యారెక్టర్ అని చెప్పారు. షూటింగ్ పూర్తయ్యిందని, అమెజాన్ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అలాగే అతడు పనిచేసిన హీరోయిన్స్ గురించి కూడా ప్రస్తావించారు. ఇందులో సమంత గురించి అడగ్గా.. హార్ట్ వర్కర్, డిటర్మినేషన్ అమేజింగ్, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతుందని అన్నారు. పోస్టు మజిలీ తర్వాత తన సినిమాలు ఏం నచ్చాయనగా.. ఫ్యామిలీ మెన్-2 , ఓ బేబి సినిమాలు ఇష్టమన్నారు. యశోద సినిమా చూశానన్నారు. కానీ తనవి ఆ రెండు సినిమాలు ఇష్టమని చెప్పారు.