ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి ఎంత సరదాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోను అందరితో కలిసిపోతారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, సోషల్ మీడియాలోను యమ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, ఇతర అంశాలకు సంబందించిన వివరాలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుంటారు చిరు.
ఇక అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి దెయ్యం లుక్ లో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా కనిపించే చిరంజీవి దెయ్యం లుక్ లో కనిపించడం ఏంటని అనుకుంటున్నారా. అలా అని చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఆయన ఏదైనా దెయ్యంరోల్ వేస్తున్నారా అని మాత్రం ఊహించుకోవద్దు. హాలోవీన్ సందర్భంగా చిరంజీవి వేసిన రియల్ దెయ్యం వేషం.
అవును పలువురు సినీ సెలబ్రిటీలు హాలోవీన్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. వారిలో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఆయన తన హాలోవీన్ లుక్ ను ఇన్ స్టా స్టోరీస్ లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోతో పాటు ఎగ్జయిట్ మెంట్ డే అని క్యాప్షన్ పోస్ట్ చేశారు చిరంజీవి. ఆరున్నర పదులు వయసు దాటినా ఆయన ఎంతో ఉత్సాహంగా పిల్లలతో పోటీ పడుతూ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం విశేషం.
అన్నట్లు చిరంజీవి తాజా సినిమా ఆచార్య షూటింగ్ పూర్తై వచ్చే యేడాది ఫిభ్రవరి 4న విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే, డైరెక్టక్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి చిరంజీవి కమిట్ మెంట్ ఇచ్చారు.