టీమిండియా సారథి రోహిత్ శర్మ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హిట్ మ్యాన్ వెండితెరపై కనిపించనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.. ఈ మేరకు రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లుక్ కు పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. అయితే.. ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేక డాక్యుమెంటరీనా, అడ్వర్టైజ్‌మెంటా అన్నది తెలియరాలేదు. దీనికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 4న లాంచ్ కానుంది.
ఇక్కడ, రోహిత్ ఒక్కడే అనుకుంటే పొరపాటు. మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ, కార్తీ, కపిల్ శర్మ, రష్మిక మందన్నా, త్రిషా కృష్ణన్ కూడా నటించారట. ఎవరకి వారు.. తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో ఫస్ట్ లుక్ పోస్ట్ చేసారు. రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ.. ‘Butterflies in my stomach. A debut of a kind’ అని పెట్టారు. అంటే ‘నా కడుపులో సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన ఆరంభం’ అని అర్థం. ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేక డాక్యుమెంటరీనా, అడ్వర్టైజ్‌మెంటా, లేదంటే టీ20 వరల్డ్ కప్ ప్రమోషనా అన్నది క్లారిటీ లేదు. ఈనెల 4 తారీఖున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగనుంది.
మరోవైపు.. హిట్ మ్యాన్ సారథ్యంలోని భారత జట్టు సూపర్-4కు సిద్ధమవుతోంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా, మరోసారి పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే.. ఇది సాధ్యం కావాలంటే హాంగ్ కాంగ్‌పై పాకిస్తాన్ విజయం సాధించాలి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Stay tuned to find out more…! #MegaBlockbuster #StayTuned pic.twitter.com/W2VAygN5o7
— Actor Karthi (@Karthi_Offl) September 1, 2022