లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారత్‌ను ఒడ్డుకుచేర్చే భాద్యత షమీ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 95 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన షమీ ఇప్పుడు బ్యాటుతోనూ అదరగొట్టాడు. టెస్టు కెరీర్లో మహ్మద్ షమీ రెండే అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే, ఛటేశ్వర్ పూజారా మినహా అందరూ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ ఆధిక్యం అంతంత మాత్రమే అయ్యింది. టాప్ ఆర్డర్ బాధ్యతను తీసుకున్న షమీ అద్భుతమైన హాల్ఫ్ సెంచరీతో మెప్పించాడు. షమీ అద్భుతమైన నాక్‌తో భారత్ 259+ ఆధిక్యానికి చేరుకుంది. మరో ఆసక్తికరమైన షమీ తన సెకెండ్ టెస్టు ఫిఫ్టీని సిక్సర్ బాది సాధించడం మరో విశేషం. మొయిన్ అలీ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ బాది షమీ హాల్ఫ్ సెంచరీ సాధించాడు. 92 మీటర్ల భారీ సిక్సర్‌తో హాల్ఫ్ సెంచరీ చేయగానే బాల్కనీలోని భారత్ టీమ్ అంతా ఆనందంతో గంతులేశారు. ఐదో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 286/8. క్రీజులో షమీ(52), బుమ్రా(30) ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు.