ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలెబ్రీటీలకు హత్యా బెదిరింపులు రావటం పెరిగిపోయింది. గతంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లకు హత్యా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు తండ్రీ కొడుకుల్ని చంపుతామంటూ ఓ లేఖను పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సల్మాన్‌కు, ఆయన తండ్రికి భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులకు హత్య బెదిరింపులు వచ్చాయి.
ఇద్దర్నీ చంపుతానంట ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతడి బెదిరింపులు పెరగటంతో విక్కీ కౌశల్ పోలీసులను ఆశ్రయించారు. ముంబైలోని శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. విక్కీ కౌశల్ తన ఫిర్యాదులో.. ‘‘ ఓ వ్యక్తి గత కొద్దిరోజుల నుంచి నన్ను, కత్రినా కైఫ్‌ను బెదిరిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్లో టార్చర్ చూపిస్తున్నాడు. కత్రినాను చంపుతానంటున్నాడు.
కత్రినాను బాగా వేధిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. విక్కీ ఫిర్యాదుతో పోలీసులు 506(2), 354(D) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్లు చిన్నవాడు.
ఈ జంట ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే కత్రినా తన పిక్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరి, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులకు హత్యా బెదిరింపులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి :