viral fever : కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గత మూడేళ్లుగా నానా ఇబ్బందులు పడుతోంది. కరోనా వైరస్ సృష్టించిన అలజడి కారణంగా వైరల్ అన్నా, వైరస్ అన్నా జనం భయపడిపోయే పరిస్థితి.. జికా వైరస్ కారణంగా ఆఫ్రికా అట్టుడికిపోయింది. నిఫా వైరస్ కేరళలలో కలకలం రేపింది. తాజాగా, ఓ బ్రిటీష్ మహిళ అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఫీవర్ బారిన పడింది. ఈ ఫీవర్ పేరు ‘‘ క్రిమీన్ కాంగో హ్యామరేజిక్ ఫీవర్’. సెంట్రల్ ఆషియాకు ప్రయాణించటం కారణంగా ఆమెకు ఈ ఫీవర్ వచ్చిందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ ఫీవర్ పిరుజులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవులు వంటి పాడి జంతువుల కారణంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది.
ఈ ప్రమాదకరమైన జ్వరం అంత త్వరగా వ్యాప్తి చెందేది కాదని, మనుషుల మధ్య వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. ఒక వేళ ఈ జ్వరం వస్తే ముప్పై శాతం మంది రెండు వారాల్లోనే చనిపోతారని తెలిపారు. ఉన్నట్టుండి జ్వరం రావటం, ఒళ్లు నొప్పులు, కండల నొప్పి, మబ్బుగా ఉండటం చర్మంలోంచి, కళ్లలోంచి రక్తం రావటం వంటివి ప్రధాన లక్షణాలన్నారు. నార్త్ ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లోని కొన్ని పాంతాల్లో ఈ హిఅలోమా పిరుజులు ప్రధాన వాహకంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశంలో 2012నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇది మూడోది. ప్రస్తుతం ఆమెను రాయల్ ఫ్రీ ఎజెన్సీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
ఇవి కూడా చదవండి : థియేటర్ పై బాంబ్ దాడి..300 మంది మృతి..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.