పకృతి అందాలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకుల విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో జరిగింది. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకెళ్తున్న.. ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన.. సింగిల్ ఇంజిన్ లైట్ వెయిట్ విమానం ఈ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం మరియా రైచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే నాజ్కా విమాన కేంద్రానికి దగ్గర్లో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు టూరిస్టులు, పైలట్, కో పైలట్ అందరూ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. నాజ్కా లైన్లను ప్రపంచ వారసత్వ సంపదా యునెస్కో గుర్తించింది. ఈ నాజ్కా లైన్లను తిలకించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులకు నాజ్కా లైన్లు చూపించేందుకు మరియా రైచీ విమానాశ్రయం నుంచి డజన్ల కొద్దీ విమానాలు తిరుగుతుంటాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BREAKING #PERU
🔴PERU: FATAL CESSNA 207 PLANE CRASH AT NAZCA LINES!
7 people killed after a Cessna 207 plane touring Nazca lines crashes in Peruvian desert. #BreakingNews #Nazca #Accident #PlaneCrash #Accidente #Plane #AccidenteAereo #Cessna pic.twitter.com/YElmWxeV2s
— loveworld (@LoveWorld_Peopl) February 4, 2022