తనకి తెలియకుండా భర్త ఇంకో మహిళతో కాపురం చేస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? ఉప్పు, కారం జల్లి ఉక్కుపాతరేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఓ మహిళ భర్త కోసం ఏకంగా ముగ్గురు భార్యలను సెట్ చేసింది. భర్త కూడా నా భార్య ఇష్టమే తన ఇష్టమని అంటున్నాడు. ఇంతకీ ఈ విచిత్రం ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా? థాయిలాండ్‌లో. థాయిలాండ్‌కి చెందిన 44 ఏళ్ళ ఫాతిమా.. తన భర్తకు ముగ్గురు ప్రియురాళ్ళు కావాలని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. తన భర్తను సంతోషంగా ఉంచుతూ, ఇంటి పనిలో సహాయం చేసే ముగ్గురు ప్రియురాళ్ళు కావాలని, ఒక్కొక్కరికీ నెలకి రూ. 33,500 జీతం ఇస్తానని వెల్లడించింది. కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందండోయ్.
వయసు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, దరఖాస్తు చేసుకునే మహిళలు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని, హైస్కూల్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలని, పిల్లలు అస్సలు ఉండకూడదని కండిషన్స్ పెట్టింది. అంతేకాదు సెలెక్ట్ అయిన మహిళలకి.. ఫుడ్డు, బెడ్డు, రెంటు ఉచితమని బంపరాఫర్ ఇచ్చింది. ఈమె పెట్టిన ప్రకటన చూసి ఒకామె రెస్పాండ్ అయ్యింది. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఫాతిమా.. ఇంకా రెండు వైఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తన భర్తతో కలిసి కాపురం చేయడం లేదని, తానొక బ్యాడ్ వైఫ్‌గా ఫీలవుతున్నానని వెల్లడించింది.
తన భర్త బాగా కష్టపడి వస్తే సంతృప్తిపరచలేకపోతున్నానని, అందుకే తన భర్తను చూసుకోవడానికి ముగ్గురు మహిళలు కావాలని ప్రకటన పెట్టినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన భర్త లైఫ్‌లోకి ఒక మహిళ వచ్చిందని, ఆమె తమతోనే ఉంటుందని, సంతోషంగా జీవిస్తున్నామని ఒక వీడియోలో వెల్లడించింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, కోరుకున్న వ్యక్తితో కలిసి జీవించే స్వేచ్ఛను భర్తకు ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తనకున్న డిప్రెషన్ కారణంగా నిద్రమాత్రలు వేసుకోవాల్సి వస్తుందని, అందుకే తన భర్త కోసం ఇలా ప్రియురాళ్ళని సెట్ చేస్తున్నానని ఆమె వెల్లడించింది. మరి భర్త కోసం ప్రియురాళ్ళ కోసం ప్రకటన ఇచ్చిన ఈ మహిళపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Sorga dunya
Thai wife hires mistresses for husband with a 15,000 baht salary – https://t.co/S7QWnnn8SV
— Dzul Kamal (@dzulkamal) August 4, 2022