రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం ఇచ్చేవారు దొరక్క చాలామంది రోగులు చనిపోతున్నారు.
మనిషి రక్తం చూడడానికి ఎరుపురంగే. కానీ రక్తంలో అనేక గ్రూప్ లుంటాయి. ఆ గ్రూప్స్ బట్టే అవసరమైన వారికి రక్తం ఇవ్వాలి లేదా స్వీకరించాలి. అయితే ఒకొక్కసారి అత్యవసర పరిస్థితిల్లో అనుకున్న సమయానికి రక్తం ఎక్కించాల్సి ఉన్నా వారికీ సేమ్ బ్లడ్ దొరకడం కష్టమవుతుంది. దీంతో సైంటిస్టులు తమ మెదడుకు పదును పెట్టారు. మానవ మేథస్సు కృతిమ రక్తం కనుగొనే దిశగా అడుగులు వేసింది. ఈ సమస్యకు చెక్ చెప్పే దిశగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు చనిపోయాయి. కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్, ఎయిర్ అంబులెన్స్‌లలో ఒ-నెగటివ్ రక్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రక్తం అన్ని గ్రూప్‌లకు సరిపోతుంది. జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూర్చనుందని భావిస్తున్నారు.