బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. ఈ సామెత అందరికీ తెలిసిందే. భారత దేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా పరిపాలించి.. ఇక్కడ సంపద అందా దోచుకు వెళ్లిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు భారతీయుడు పరిపాలించబోతున్నాడు. బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అద్బుతం సృష్టించాడు.. అతడే రిషి సునాక్. అతి పిన్న వయసులో బ్రిటన్ ప్రధానిగా ఏక గ్రీవంగా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా రిషి సునాక్ కి అభినందనలు తెలుపుతుంటే.. కొంతమంది మాత్రం అసలు ఎవరీ రిషి సునాక్..? ఎక్కడి వాడు..? అతను ఏ కులానికి చెందిన వాడు? అంటూ సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ పేరు పై రక రకాల చర్చలు జరుగుతున్నాయి. హిందూ పేర్లలో సునాక్ అనేది ఉండదని.. సౌనక్ అని ఉండాలని కొంతమంది నిపుణులు అంటున్నారు. అయితే రిషి సునాక్ అంటే సంస్కృత భాషలో శునకం అని అర్థం.. సౌనక్ అంటే సాధువు అని అర్థం. బహుషా భారత రికార్డులో రిషి సునాక్ పేరు తప్పుగా పడి ఉండవొచ్చని కొంత మంది అనుకుంటున్నారు. ప్రస్తుతం రిషి సునాక్ ఇంటిపేరు, కులం పేరు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారింది. రిషి సునాక్ బ్రహ్మణుడైనప్పటికీ అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ ది ఇప్పటికీ ఏ కులం అనేది ఎవరికీ తెలియదు. అయితే చాలా మంది మాత్రం ఆయన పంజాబీకి చెందిన వాడని అంటున్నారు. సాంప్రదాయమైన బ్రహ్మణ జీవితాన్ని గడుపుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. కాకపోతే రిషి సునాక్ పక్కా బ్రహ్మాణుడు అని మాత్రం ఎవరూ నిర్థారించలేదు. సునాక్ తల్లిదండ్రుల పూర్వీకులు భారతీయులే.. ఈస్ట్ ఆఫ్రికా నుంచి యూకేకి వలస వెళ్లిపోయారు. తండ్రి యశ్వీర్ సునాక్, తల్లి ఉషా సునాక్ వీరి ఇద్దరూ ఫార్మాసిస్టులు. ఏది ఏమైనా బ్రిటీష్ సామ్రాజ్య పీఠం అధిరోహించే స్థాయికి రిషి సునాక్ వెళ్లడంపై గర్వించాల్సింది పోయి.. అతని వ్యక్తిగత జీవితం.. కులం గురించి గూగుల్ లో సెర్చ్ చేయడంపై మీరు ఇంకా మారరా నాయనా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.