ఇప్పటికే రకరకాల వైరస్ లతో పోరాడుతోన్న మానవాళికి మరో ముప్పు పొంచివుంది. అదే.. కలుషితం. నిలబడే నేల, తాగే నీరు, పీల్చే గాలి, వెలిగే నిప్పు, శబ్దాలను ఊటంకించే ఆకాశం సైతం కలుషితమవుతున్నాయి. ఇది రాను.. రాను.. ప్రజల ప్రాణాలను హరించేలానే ఉంది.
నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం.. వీటినే పంచభూతాలు అంటారు. మానవ మనుగడకు ఇవే ఆధారం. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మానవ మనుగడకే ప్రమాదం. నిలవడానికి నేల, తాగడానికి నీరు, వంట చేసుకోవడానికి నిప్పు, పీల్చడానికి గాలి, శబ్దాలను వినడానికి ఆకాశం ఉండవలసిందే. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ.. అన్నీ కలుషితం అయిపోతున్నాయి. అది ప్రాణానికే ముప్పులా పరిణమించింది. తాజగా, థాయ్‌లాండ్ దేశంలో వాయు కాలుష్యం వల్ల 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజుల్లో సుమారు రెండు లక్షల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది.
థాయ్‌లాండ్ లో గాలి నాణ్యత అంతకంతకూ క్షీణీస్తోంది. గత వారం రోజుల్లో వాయు కాలుష్యం వల్ల సుమారు 13 లక్షల మంది ప్రజలు అస్వస్థతకు గురైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు వెల్లడించారు. వాహనాల నుండి వెలువడే పొగ, పరిశ్రమలు విడుదలచేసే కర్బనఉద్గారాలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వెలువడే పొగ కారణంగా థాయ్ రాజధాని బ్యాంకాక్ అట్టుడుకుతోంది. గాలి పీల్చాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని థాయ్‌లాండ్ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.
ముఖ్యంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని 50 జిల్లాల్లో గాలి నాణ్యత బాగా క్షీణీస్తోంది. 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే చాలా తక్కువ. ఇది ప్రాణాలకే ప్రమాదం. కలుషితమైన గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు మనిషి రక్తంలో కలిసిపోయి శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని సూచించింది. వీలైనంతవరకు ఇంటి నుంచే పనిచేయాలని, బయటకు వచ్చేప్పుడు ఎన్95 మాస్కులు ధరించాలని సూచిస్తోంది. అలాగే, ముఖ్యమైన ప్రదేశాలలో నో ‘డస్ట్ రూమ్’ పేరుతో ఎయిర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసింది.
Air pollution sickens more than 1.3 million people in Thailand https://t.co/rX6S4XTUjI
— NEWS BUZZ (@NewsbuzzLive) March 13, 2023