ఈ మద్య కాలంలో ఎక్కువగా భూకంపాలు మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏప్పుడు భూకంపాలు వస్తాయో.. ప్రాణాలు పోతాయో అని భయంతో వణికిపోతున్నారు. ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు..
ఇటీవల మానవాళిపై ప్రకృతి పగబట్టిందా అంటే అవునే అనిపిస్తుంది.. వరుసగా భూకంపాలు, వరదలు, మంచు తుఫాన్లు ఒక్కటేమిటి ఎన్నో రకాల ప్రకృతి విపత్తులు మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెల టర్కీ, సిరియాలో సంబవించిన భూకంపం ప్రళయాన్ని సృష్టించింది. సుమారు 47 వేల మందికి పైగా మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం పేరు వినిపిస్తే చాలు ప్రజలకు వెన్నుల్లోంచి వణుకు మొదలవుతుంది. తాజాగా ఇండోనేషియాలో భూకంపం సంబవించింది. వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియాలో శుక్రవారం ఉదయం హల్మహెరా ద్వీపానికి ఉత్తరాన 6.2 తీవ్రతతో భూకంపం సంబవించిందని అధికారులు వెల్లడించారు. యురోపియన్ మెడిటరేనియర్ సొస్మోలాజికల్ సెంటర్ ఈ విషయాన్ని తెలిపింది. హల్మహెరాకు సమీపాన భూమికి 99 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు షనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గత కొంత కాలంగా ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. గత నెలలో ఇండోనేషియా లో భారీ భూకంపం సంబవించింది.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7 గా నమోదు అయ్యింది.
ఇదిలా ఉంటే.. నిన్న గురువారం రాత్రి చైనా సరిహద్దు తజకిస్థాన్ లో భూ భాగంలో భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.3 గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. చైనా సరిహద్దు కు సుమారు 82 కిలోమీటర్ల దూరంలో తజికిస్థాన్ భూభాగంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తజికిస్థాన్ లో కొంతకాలంగా ప్రకృతి బీభత్సాలు వరుసగా జరుగుతున్నాయి. ఎక్కువగా వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, భారీ హిమపాతాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే నమోదు అవుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఈ మద్య కాలంలో మానవాళిపై ప్రకృతి పగబట్టిందా అన్న చందంగా వరుసగా విషాద సంఘటనలు జరుగుతున్నాయి.
Indonesia: Earthquake’s origin was at a depth of 99 kilometers. #Earthquake #Indonesia #IndonesiaEarthquake https://t.co/solfhtLMNC
— Republic (@republic) February 24, 2023