పంచ భూతాలలో ఏ ఒక్క భూతం ప్రకోపించినా ఈ సృష్టికి వినాశనం తప్పదు. అందుకు తగ్గట్లుగానే ప్రకృతి ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆ కోపం కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను సైతం కోల్పొతున్నారు. ఇక వర్షాకాల సీజన్ అయితే నగరాలను, పట్టణాలను వరదలు ముంచెత్తిన సంఘటనలు మనం చాలానే చూశాం. ఈ క్రమంలో భారీ వరదలు ఓ పట్టణాన్ని ముంచెత్తాయి. ఆ వరదల్లో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. అదీ కాక ఓ వ్యక్తికి చెందిన రూ.8 కోట్ల విలువైన కారు సైతం వరదల్లో కొట్టుకుపోయింది. ఇక ఈ వార్తకు చెందిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
హరికేన్.. మన దగ్గర ఈ పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. అమెరికాకు ఈ పేరంటే వణుకే. ఎందుకంటే? అమెరికాలో వచ్చే తుపాన్ లను హరికేన్ లని పిలుస్తారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇయన్ హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ ఇయన్ తుపాన్ ధాటికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది.. ఇక ఇంటి స్థలాల్లో పార్క్ చేసిన వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. వరద నీటిలోకి షార్క్ లు సైతం కొట్టుకొస్తున్నాయి. ఈ వరదల ధాటికి వలసకారుల పడవ బోల్తా పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వరదలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఓ వ్యక్తికి చెందిన మెక్ లారెన్ కంపెనీకి చెందిన p1 సూపర్ కారు ఈ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ కారు విలువ ఎంతో తెలుసా? 1 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8 కోట్లు అన్న మాట. అయితే కారు నీటిలో కొట్టుకుపోయే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ స్పందిస్తూ..”ఇది చాలా బాధాకరమైన విషయం.. కారు పోతే పోయింది మీరు మంచిగా ఉండండి” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఈ కారు కొందానికి ఎన్ని సంవత్సరాలు డబ్బులు దాచుకున్నాడో పాపం.. అంటూ రాసుకొచ్చారు. ఇయన్ హరికేన్ బీభత్సానికి ఫ్లోరిడా నగరం మెుత్తం సముద్రాన్ని తలపిస్తోంది. రవాణా స్తంభించింది. భారీ బిల్డింగ్ లు సైతం నేలకొరిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది.