ప్రతి ఒక్కరు తరచూ వివిధ కారణాలతో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా పరీక్షలు, ఉద్యోగం, పెళ్లి, పుట్టిన రోజు వేడుకలు.. ఇలా పలు సందర్భాల్లో సంబరాలు జరుపుకుంటారు. కానీ ఓ వ్యక్తి విడాకులు మంజురయ్యాయని సంబరాలు జరుపుకున్నాడు. అయితే ఈ సంతోషంలో అతడు చేసిన ఓ సాహస క్రీడ... అతడి జీవితాన్నే తలక్రిందులు చేసింది.
సాధారణంగా ఎవరైన పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఓణీల ఫంక్షన్లు, ఇంకా సీమంతం వంటి వేడుకలు నిర్వహిస్తుంటారు. వివాహల విషయంలో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త రకం వేడుక ఒకటి ట్రెండ్ అవుతుంది. విడాకులు తీసుకున్న వాళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవలే ఓ యాక్టర్.. విడాకులు వచ్చిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ చేసుకుంది. తాజాగా ఓ వ్యక్తి కూడా విడాకులు వచ్చిన సందర్భంగా ఆనందంలో ఓ సాహస క్రీడా చేశాడు. ఆ క్రీడా అతడి జీవితాన్ని తలకిందులు చేస్తూ.. ఆస్పత్రి పాలు చేసింది. ఇంతకి ఏమి జరిగిందనే కదా మీ సందేహం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్ దేశానికి చెందిన రాఫేల్ డాస్ సొంటోస్ అనే 22 ఏళ్ల యువకుడు.. తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. చాలా రోజుల వీరి విడాకులపై కోర్టులో విచారణ జరిగింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రాఫేల్ కు విడాకులు మంజూరయ్యాయి. దీంతో సంబర పడిపోయిన రాఫేల్ జీవితాన్ని కొత్తగా ఆస్వాదించాలనుకున్నాడు. విడాకులు తీసుకున్న సంబంరాన్ని గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకోవాలని అతడు భావించాడు. అందుకే పెళ్లి చేసుకోవడమే ఒక్క సాహసం.. అని దానికి మించిన సాహసం మరొకటి లేదని భావించాడు.
అలా వింత ఆలోచన రావడంతో ఓ సాహస క్రీడకు రాఫేల్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న కాంపో మాగ్రో ప్రాంతంలోని ఓ సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ 70 అడుగులపైన ఉన్న వంతెన పైనుంచి బంజీ జంపింగ్‌ను చేయాలని అతడికి అనిపించింది. అనుకున్నదే ఆలస్యం తన కాళ్లకు తాడు కట్టుకుని అతడు బ్రిడ్జిపై నుంచి దూకాడు. దురదృష్టవశాత్తూ అతడి కాళ్లకు ఉన్న తాడు తెగిపోవడంతో 70 అడుగుల ఎత్తు నుంచి తలకిందులుగా లోయలోని నీటిలో పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ, వెన్నుముక విరిగిపోయాయి. తీవ్ర గాయాలైన అతడి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అతడి ప్రాణానికేమి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితుడులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాుయ. ఆ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాఫేల్.. తన జీవితం పూర్తిగా మారిపోయిందని వాపోయాడు. ఒకప్పుడు తాను చాలా ప్రశాంతంగా ఉండేవాడినని, ప్రస్తుతం తన పరిస్థితి గుర్తింపట్ట లేనంతగా మారిపోయిందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.