నేటికాలంలో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో శృతిమంచి ప్రవర్తిస్తున్నారు. ట్రైన్లు, బస్సులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటారు. అలాంటి వారిని కొందరు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
నేటికాలంలో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో శృతిమంచి ప్రవర్తిస్తున్నారు. ట్రైన్లు, బస్సులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటారు. అలానే అమ్మాయిలను కామెంట్స్ చేస్తూ అతిగా ప్రవర్తిస్తుంటారు. అయితే చాలా మంది వారి ఆగడాలను భరిస్తారే.. కానీ ప్రశ్నించరు. అయితే కొందరు మాత్రం ఆకతాయిలను అడ్డుకుంటారు. మరికొందరు అయితే మాటవినని ఆకతాయిలపై చేయికూడా చేసుకుంటారు. అయితే ఇలా అడ్డుకునే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతుంటాయి. తాజాగా ట్రైన్ లో కొందరు యువకులు చూపిన అత్యుత్సాహం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలోని న్యూయార్క్‌లోని సబ్‌వేపై అరుస్తున్న 30 ఏళ్ల వ్యక్తిని తోటి ప్రయాణికుడు పట్టుకుని చోక్‌హోల్డ్ పద్ధతిలో ఉంచడంతో సోమవారం మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జువాన్ అల్బెర్టో వాజ్క్యూస్ తన ఫోన్‌లో రికార్డ్ చేసి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరు, ఏమిటనే వివరాలు తెలియరాలేదు. సదరు వ్యక్తి పిచ్చి పట్టిన వాడిలో గట్టిగా కేకలు వేస్తూ తనకు ఆకలిగా ఉందని, దాహం వేస్తోందని, ఏమీ పట్టించుకోవడం లేదని, జైలుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని, కాస్త దూకుడుగా అరవడం ప్రారంభించాడు.
దీంతో తోటిప్రయాణికులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న కొందరు యువకులు.. సదరు వ్యక్తిని నిలవరించే ప్రయత్నం చేశారు. అందుకోసం చోక్ హోల్డ్ పద్దతిని ఉపయోగించారు. ఈ విధానంపై అమెరికాలో ఎప్పటి నుంచి వివాదం ఉంది. గతంలో పోలీసులు దీనిని ఉపయోగించేవారు. దీని కారణంగా ప్రాణాలు పోతున్నాయని అమెరికా నిషేధించింది. అయితే తాజాగా ఆ యువకులు.. అరుస్తున్న వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. అతను తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని కాళ్ళను తన్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తెచ్చేందుకు పయత్నం చేశారు.
అయితే ఆ వ్యక్తి ప్రతిఘటించడం ఆగిపోవడంతో వదిలేశారు. యువకులు వదిలేసిన కాసేపటికే ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకుని విచారించారు. అయితే విచారణ అనంతరం వారిని వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వీడియో సోష ల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.