మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరిటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పోల్గొనగా..హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజా 2021 లో మూడో సారి విశ్వసుందరి కిరిటం హర్నాజ్ కౌర్ ద్వారా భారత్ గెలిచింది.
ఈ పోటీలకు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ పోటీల్లో హర్నాజ్ కౌర్ న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానం చెప్పి.. వారి మనస్సులను గెలిచింది. రోజు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఎలా అధిగమించాలి? నేటి తరం యువతులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అని జ్యూరీ సభ్యులు అడిగ ప్రశ్నకు హర్నాజ్ చక్కటి సమాధానం ఇచ్చారు.
తమకు తాము స్పెషల్ అని తెలుకోవాలని, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలని సూచించారు హర్నాజ్ కౌర్. వాతారవరణ మార్పు ఒక బూటకం అంటుంటారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏమిటి? అని జ్యూరీ సభ్యులు మరో ప్రశ్న వేయగా..ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని, అవి తెలిసస్తే గుండె పగిలిపోతుందని… మనం చేసే ప్రతి మంచి పని ప్రకృతిని రక్షించగలదని కౌర్ సమాధానం చెప్పారు. ఇక విశ్వసుందరి గా తన పేరు ప్రకటించగానే ఆనందంతో కన్నీళ్లు కార్చారు హర్నాజ్.హర్నాజ్ కౌర్ పంజాబ్ చండీఘర్ డిసెంబర్ 3,2000 సంవత్సరంలో సిక్కిం కుటుంబంలో జన్మించడం విశేషం.
It is a proud day for India 🇮🇳 as #HarnaazSandhu has been crowned the 70th Miss Universe 2021 👑👏#MissUniverse2021 #MissUniverse #harnaazkaursandhu pic.twitter.com/FnVXxA8QKY
— editorji (@editorji) December 13, 2021