ఈ భూమ్మీద అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని వింతలు అస్సలు అంతుబట్టవు. ఇక అంతరిక్షంలో చోటు చేసుకునే వింతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ కోవకు చెందిన అబ్బురం ఒకటి ఆకాశంలో ఆవిష్కృతమయ్యింది. మళ్లీ వెయ్యేళ్ల తర్వాత చోటు చేసుకునే ఈ వింత సంఘటన 2022, ఏప్రిల్ 26, 27న చోటు చేసుకుంది. అదేంటంటే.. నాలుగు ఉపగ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. అది కూడా సూర్యోదయానికి ముందే. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. ఇలాంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావాలంటే.. మరో 1000 ఏళ్లు ఎదురు చూడాల్సిందే అని భవనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ వెల్లడించారు. ఇలా నాలుగు గ్రహాలు వరుసగా ఒకే సరళరేఖపైకి రావడాన్ని ప్లానెట్ పరేట్ అంటారని.. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి సరైన శాస్త్రీయ నిర్వచనం లేదని తెలిపారు. అయితే దీనికి ఖగోళ శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉందన్నారు పట్నాయక్.
ఇది కూడా చదవండి: బలే ఐడియా.. ట్రాఫిక్ నుంచి కరెంట్ తయారీ!
‘ప్లానెట్ పెరేడ్’ మూడు రకాలుగా ఉంటుందని పట్నాయక్ వెల్లడించారు. సూర్యుడు ఒకవైపు, మూడు గ్రహాలు ఒకవైపు ఒకే వరుసలో ఉన్నప్పుడు మొదటి రకమైన గ్రహ వరుస క్రమంగా పేర్కొంటారని, ఇలాంటి సంఘటనలు సంవత్సరంలో చాలా సార్లు మనం చూడొచ్చని తెలిపారు. అయితే నాలుగు గ్రహాల వరుస క్రమం అరుదుగా ఏర్పడుతుందని, నాలుగు, ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం ప్రతి 19ఏళ్లకు ఒకసారి జరుగుతుందని ఆయన తెలిపారు. సౌర వ్యవస్థలోని మొత్తం ఎనిమిది గ్రహాలు చాలా అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయని, దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి అలా జరుగుతుందని పట్నాయక్ తెలిపారు. అయితే నాలుగు గ్రహాల వరుస క్రమం ఆకాశంలో ఆవిష్కృతం కావడానికి 1000 పడుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Marriage Viral Video: పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు! వీడియో వైరల్!
మూడవ రకం గ్రహాల వరుసక్రమం అరుదైన సందర్భాలలో మాత్రమే జరుగుతుందని తెలిపారు. 2022 ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరిగిన అరుదైన ఖగోళ సంఘటన అరుదైన సందర్భాలలో జరిగే మూడవ రకమైన గ్రహ వరుస క్రమమని పట్నాయక్ తెలిపారు. ఏప్రిల్ 30న అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలు అయిన శుక్రుడు, బృహస్పతి ఒకదానికొకటి చాలా దగ్గరగా చూడవచ్చునని, శుక్రుడు బృహస్పతికి దక్షిణంగా 0.2 డిగ్రీల దూరంలో ఉంటాడని పట్నాయక్ తెలిపారు. మరి ఈ అంతరిక్ష అద్భుతం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Massage: వీడియో: కంప్లైంట్ చేయడానికి వెళ్లిన మహిళతో మసాజ్ చేయించుకున్నాడు!