అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ పో*ర్న్ స్టార్ కోర్టులో దావా వేసింది. తనతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడని వెల్లడించింది. ట్రంప్ పై నేరారోపణలు వస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని స్వయంగా ట్రంప్ వెల్లడించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు అరెస్ట్ చేసే సూచనలు కనబడుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. మాజీ పో*ర్న్ స్టార్ కు భారీగా డబ్బులిచ్చాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రంప్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అరెస్ట్ చేస్తే నిరసన తెలియజేయమని తన మద్దతుదారులకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఒకేవేళ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు రుజువైతే మాజీ అధ్యక్షుడి మీద నమోదయ్యే తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 ఎన్నికలకు ముందు మాజీ పో*ర్న్ స్టార్ స్టార్మి డేనియల్స్ కి భారీగా డబ్బులు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ పై నేరారోపణలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కి, పో*ర్న్ స్టార్ తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆమె రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి.. ట్రంప్ తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్ క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజిల్స్ కోర్టులో దావా వేసింది. అయితే ట్రంప్ మాత్రం ఆమెతో ఎఫైర్ ఉందన్న విషయాన్ని అంగీకరించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రంప్ ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.