కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు మీదకు వదిలి చోద్యం చూస్తుందంటూ విమర్శల పాలైన డ్రాగన్ దేశం.. మహమ్మారి కట్టడికి కఠిన లాక్డౌన్ విధించి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లడానికి వీళ్లేదు.. ప్రభుత్వం సప్లై చేయదు.. దీంతో జనాలు పురాతమైన వస్తు మార్పిడి పద్దతిని అనుసరిస్తున్నారు. బియ్యం కోసం స్మార్ట్ ఫోన్ ని, సిగరెట్ల కోసం టమాటాలను మార్పిడి చేసుకుంటున్నారు.
Shanxi province xi’an city
Authorities are sealing people’s windows to ensure the airborne covid can’t escape from people’s apartments.
2021.12.26 pic.twitter.com/pHMDOiH3kk— Songpinganq (@songpinganq) December 27, 2021
జియాన్ నగరంలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రసుత్తం దేశంలో జీరో కరోనా కేసులు.. మరణాలు అసలు లేవని ప్రకటించిన చైనా.. జియాన్ నగరంలో డిసెంబర్ 23 నుంచి కఠినమైన లాక్డౌన్ విధిస్తోంది. జనాలు బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదు. దీని గురించి వాస్తవాలు మీడియాలో ఎలాను రావు. దాంతో జనాలు సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్నాం.. సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.
ఇది కూడా చదవండి : కరోనా మాత దేవాలయం… కట్టారు- కూల్చేసారు. ఎందుకో తెలుసా?
జనాల ఆవేదన ఇలా ఉండగా.. ప్రభుత్వ వైఖరి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజలకు ఏలాంటి ఇబ్బంది రాకుండా.. వారికి కావాల్సిన సర్వం ఇంటికి వెళ్లే అందిస్తున్నట్లు ప్రకటించుకుంటుంది. కానీ జనాలు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదని.. తమ పరిస్థితిని వివరిస్తూ.. సోషల్ మీడియా యాప్ విబోలో పోస్ట్ లు చేస్తున్నారు.
Scenes from Xi’An lockdown: return of the barter economy 🚬
People can no longer leave their flats, even to shop. This resident makes light of the situation via Kuaishou, a TikTok-like social media platform pic.twitter.com/gsE9NnJnWz
— Cindy Yu (@CindyXiaodanYu) January 3, 2022
వీటిలో జనాలు సిగరేట్ కి బదులు టమోటా, క్యాబేజీ, యాపిల్స్ కు బదులు పాత్రలు తోమే లిక్విడ్, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్, రొట్టెలకు బదులుగా నూడుల్స్ వస్తు మార్పిడి చేసుకుంటూ.. రోజులు వెల్లదీస్తున్నారు. ఈ తరహా సంఘటనలు ఎక్కువగా.. అపార్ట్‌మెంట్ లలో కనిపిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో జనాలు రేడియో ఇంటర్వ్యూలో వెల్లడిస్తున్నారు. వీరిలో కొందరు బియ్యం కోసం స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్ లను అమ్మేయడం, తాకట్టు పెట్టడం చేసినట్లు చెబుతున్నారు. కొందరు పొరుగువారి పరిస్థితికి జాలిపడి.. తమ దగ్గర ఎక్కువగా ఉన్న సరుకులను ఇతరులకు దానం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : చైనాలో స్కూళ్లు, విమాన ప్రయాణాలు బంద్.. కరోనా థర్డ్‌వేవ్ రానేవచ్చిందా?