Rooster: పెంపుడు జంతువులల్లో కుక్కలు, ఆవులు, ఎద్దులు, కోతులకు కూడా ఎక్కువ మంది అభిమానులు ఉండటం చూశాం. అవి చనిపోతే ఊరు ఊరే అంత్యక్రియల్లో పాల్గొనటం గురించి విన్నాం. కానీ, ఓ కోడిపుంజు కోసం ఏకాంగా ఓ సిటీనే కదలింది. హత్యకు గురైన దానికి అంత్యక్రియల కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. సిటీ జనం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు! దాని హత్యకు కారణమైన వారిపై పగతీర్చుకుంటామని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మిసిసిపిలోని ఓషన్ స్ప్రింగ్స్ సిటీలో కాల్ అనే కోడిపుంజు నివాసం ఉంటోంది. ఉదయం నుంచి సాయంత్రంవరకు అక్కడి అన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ.. అందరితో బాగా కలిసిపోయేది.
అంతేకాదు! ఏ మాత్రం భయపడకుండా వారితో ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చేది. అయితే, ఏప్రిల్ 24వ తేదీన నగరం మొత్తం నిద్రలో ఉన్నపుడు కొంతమంది వ్యక్తులు కాల్ నిద్రపోతున్న చోటు దగ్గరకు వచ్చారు. ఆ గుంపులోని ఓ మహిళ దాన్ని చేత్తో పట్టుకుని వారితో పాటు తీసుకెళ్లిపోయింది. ఓ 15 నిమిషాల తర్వాత దాని మృతదేహాన్ని పక్కనే ఉన్న బిలాక్సీ సిటీలోని ఓ పార్కింగ్ ప్లేసులో పడేసి పోయింది. ఓ గంట తర్వాత ఓ వ్యక్తి కాల్ మృతదేహాన్ని తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగులో వేసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాల్ మృతదేహం ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. ఉదయం కాల్ కనిపించకుండా పోయాడనే వార్త నగరం మొత్తం దావాలనంలా వ్యాపించింది. పోలీసుల దర్యాప్తులో కేంద్ర శాఫర్ అనే కరెక్షన్ ఆఫీసర్ కాల్‌ను తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలు లభించాయి.
పోలీసులు శాఫర్‌ను పిలిచి విచారించారు. ఆమె తప్పు చేసినట్లు ఒప్పుకుంది. ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగంలోంచి తొలగించారు. కాల్ మృతదేహం కోసం అన్వేషిస్తున్నారు. కాల్ మృతదేహం జాడ చెప్పిన వారికి రివార్డులు కూడా ప్రకటించారు. తమకెంతో ఇష్టమైన, అభిమానమైన కోడిపుంజు మృతితో నగరవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. దాని మృతిపై నివాళులు అర్పిస్తున్నారు. నగరం మొత్తం కాల్ ప్రతిమలతో నిండిపోయింది. దాని అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు. శాఫర్‌కు ఉద్యోగం తీసేయటం లాంటి చిన్న శిక్ష సరిపోదని పెద్ద శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, కాల్ మృతితో తల్లడిల్లిపోతున్న సిటీ ప్రజలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Elon Musk: ట్విట్టర్ వినియోగదారులకు ఎలన్ మస్క్ షాక్.. ట్విట్టర్ ఫ్రీ కాదంటూ వ్యాఖ్య!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.