అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోని విషాదం తొంగిచూసింది. నగ్న చిత్రాలతో ఆదాయం సంపాదించటంలోనూ ఇబ్బంది మొదలైంది. మానసికంగా, శారీరకంగా ఆమె చాలా కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే..
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము. ఇప్పటివరకు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న మన జీవితం ఆనందాల బాట పట్టవచ్చు. ఈ రోజు సంతోషంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగి విషాదాల్లోకి వెళ్లిపోవచ్చు. ఆనందాల బాట పడితే మంచిదే కానీ, కష్టాలు మొదలైతే మాత్రం తట్టుకోవటం చాలా కష్టం. అలాంటి కష్టమే ఓ యువతికి వచ్చింది. అంతవరకు సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఆమెకు క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. క్యాన్సర్ చికిత్సకు డబ్బుల్లేక అల్లాడిపోతోంది. తాను చేస్తున్న పనిలోనే కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.
కొంచెం కొంచెంగా డబ్బులు పోగేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన మైయా రిచర్డ్ సన్ అనే 21 ఏళ్ల యువతి ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ సైట్‌లో తన నగ్న చిత్రాలను ఉంచి ఆదాయం సంపాదిస్తోంది. ఇలా చాలా ఏళ్ల నుంచి ఆమె చేస్తోంది. అయితే, ఆమె జీవితంలోకి అనుకోని విషాదం వచ్చింది. ఆమె నడుం భాగంలో ఓ కణితి ఏర్పడింది. ఆమె ఆస్పత్రికి వెళ్లగా.. గత సెప్టెంబర్ నెలలో ఆమెకు క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. జీవితం మొత్తం నాశనం అయిపోనట్లు భావించింది.
క్యాన్సర్ చికిత్స కోసం డబ్బులు బాగా ఖర్చు కాసాగాయి. కీమోథెరపీ, రెడియోథెరపీలకు డబ్బులు లేక ఇబ్బంది పడసాగింది. ఓన్లీ ఫ్యాన్స్ సైట్‌లో ఆపకుండా ఫొటోలు పెడుతూ డబ్బులు సంపాదించసాగింది. అయితే, కీమోథెరపీ కారణంగా ఆమె జుట్టు ఊడిపోసాగింది. తర్వాత జట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోవటంతో ఓన్లీ ఫ్యాన్స్ సబ్‌స్క్రైబర్లు తనను పట్టించుకోరని అనుకుంది. అయినా ఓ నమ్మకంతో గుండుతో ఉన్న తన ఫొటోలు పెట్టసాగింది. ‘‘ క్యాన్సర్ వచ్చినా నేను హాట్‌గానే ఉన్నా’’ అంటూ పేర్కొంది. ఆమెకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత సబ్‌స్క్రైబర్లు మరింత పెరిగిపోయారు. గత సంవత్సరం ఆమె దాదాపు 80 వేల డాలర్లు సంపాదించింది.
ఆ వచ్చిన డబ్బులతో తనను, తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానని ఆమె తెలిపింది. ఎంత కష్టం వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం తనకు ఉందని ఆమె తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను మొదట విగ్గు వేసుకుని కంటెంట్ క్రియేట్ చేసేదాన్ని. సబ్‌స్క్రైబర్లు నా గురించి ఏమనుకుంటారోనని భయపడేదాన్ని. జుట్టు ఊడిపోవటం వల్ల మానసికంగా చాలా కృంగిపోయాను. ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్స్‌లో నా అందమే పెట్టుబడి. తర్వాత విగ్గు లేకుండా కంటెంట్ క్రియేట్ చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది. మరి, మైయా రిచర్డ్ సన్ క్యాన్సర్ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.