హెల్త్ ఇన్సూరెన్స్, హోం ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఫోన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వినే ఉంటాం. కానీ కొత్తగా ఇప్పుడు ఓ అందమైన యువతి అందులోనూ ఆస్ట్రేలియాకు చెందిన మిస్ వరల్డ్ సారా తన కాళ్లకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 7 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకుంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన పొడవాటి అందమైన కాళ్లే కారణమని 22 ఏళ్ల బ్యూటీ చెబుతోంది. అందుకే తన శరీరంలోని అందమైన కాళ్లను ఇన్సూరెన్స్ చేయించానని తెలిపింది.
కాళ్లు పొడవుగా ఉండటంతో చిన్నతనంలో తనను స్నేహితులు ఆటపట్టించేవాళ్లని ఆమె గుర్తు చేసుకుంది. అయితే ఎదిగే క్రమంలో తన కాళ్లే తనకు అందాన్ని ఇస్తాయని ఊహించలేదని పేర్కొంది. గతంలో తన కాళ్లను హేళను చేసినవాళ్లే ఇప్పుడు ఆరాధిస్తున్నారని ఈ పొడుగు కాళ్ల సుందరి గర్వంగా చెప్పుకుంటుంది. మరోవైపు సారా కుటుంబంలో చాలా మంది రగ్బీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఆమె మాత్రం ఫుట్‌బాల్ వైపు అడుగులు వేస్తోంది. త్వరలో ఆమె ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ ఉమెన్స్ లీగ్‌లో ఆడబోతుంది.
ఆస్ట్రేలియా మీడియా సంస్థలు సారాకు సంబంధించి రోజూ ఏదో ఒక న్యూస్‌ను రాసేందుకు పోటీపడుతుంటాయి. ఆమె కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం ఆస్ట్రేలియా మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సారాకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సారా ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో 16,000 మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఆమె తన పేజీలో స్టైలిష్‌గా ఉన్న మోడలింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.