ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ తమ సత్తా చాటుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారు. రంగం ఏదైనా టాప్ పొజిషన్ నో దూసుకుపోతున్నారు. తాజాగా మరోసారి దీనిని నిజం చేసి చూపింది 18 ఏళ్ల తెలుగు అమ్మాయి. న్యూజిలాండ్‌లో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా చెందిన గడ్డం మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం రవికుమార్ దంపతులు 21 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. మేఘన అక్కడే పుట్టి.. అక్కడి సిటిజన్ గానే పెరిగింది. మేఘన కేంబ్రిడ్జ్ లోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. స్కూల్ డేస్ నుంచే ఛారిటీ ప్రోగ్రామ్ లు చేసింది. ఆమె తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథాశ్రమాలకు విరాళంగా ఇచ్చేది. అంతేకాకుండా, ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులకు విద్య, ఆశ్రయం మరియు ఇతర సౌకర్యాలను అందించడంలో మేఘన ముందుంది.
దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నుకుంది. ఆమె వాల్కటో ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణం చేయనుంది. దేశం కానీ దేశంలో తెలుగు జాతి కీర్తి ఇనుపడింపచేసిన మేఘనకు అందరు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి.. 18 ఏళ్ల తెలుగు అమ్మాయి ఈ ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.