ఈ మధ్యకాలంలో తరచు ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిగా సమస్యలు, ఇతర కారణాలతో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నేపాల్ దేశంలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు లో ల్యాడ్ అవుతున్న విమానం ఒక్కసారిగా రన్ వేపై కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం ఫోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నేపాల్ కి చెందిన యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఖాట్మాండు నుం చి బయలు దేరింది. పోఖారా లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంబించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా పోఖారా విమానాశ్రయాని మూసేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F
— ANI (@ANI) January 15, 2023