ప్రేమ వర్ణించలేని భావం.. చిత్రించలేని రూపం. అది ఏ క్షణాన ఎప్పుడు పుడుతుందో.. ఎవరిమీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రేమకు రంగు, కులం, మతం, ఆస్తులు అంటూ ఏవీ ఉండవు. ప్రేమ మనిషిని.. మనసునే చూస్తుంది. అదీ కాక ప్రేమకు హద్దుల్లేవ్! ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లిళ్లను సైతం మనం గతంలో, ప్రస్తుతం కూడా చాలానే చూశాం. ఇక మన సినిమా ఇండస్ట్రీలో చాలానే లవ్ స్టోరీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు చదవబోయే లవ్ స్టోరీ ఇంతకు ముందు ఎక్కడా చూసి, విని ఉండరు. ఓ యువకుడి నిజాయితి పనితనం.. ఓ యువతి మనసును కొల్లగొట్టింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ముస్కాన్ అనే యువతి తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్ లో నివాసం ఉంటోంది. వారికి 4 గేదెలు ఉన్నయి.. వీటి ఆలన.. పాలన చూడటంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది. అమీర్ 25 సంవత్సరాల కుర్రాడు. ఇతడు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వాడు. అమీర్ గురించి తెలియడంతో అతడిని ముస్కాన్ కుటుంబ సభ్యులు తమ గేదెలను చూసుకోవడానికి పనిలో పెట్టుకున్నారు. పనిలో చేరిన అమీర్ కొన్ని రోజుల్లోనే తన పనితనం చూపించాడు. దాంతో గేదెలు గతంలో కంటే ఎక్కువగా పాలు ఇవ్వడం ప్రారంభించాయి. మెుదటి నుంచి అమీర్ పనితనాన్ని ముస్కాన్ గమనిస్తూనే వస్తోంది. అతడు గేదెలను చూసుకునే విధానం ఆమెకు నచ్చింది.
దాంతో అతడిపై మనసు పారేసుకుంది. ఇదే విషయాన్ని అతడికి గేదెల పాకలోనే చెప్పింది. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా అంది. దాంతో షాక్ కు గురైన అమీర్.. మా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడానికి సమయం అడిగాడు. అటు కుటుంబ సభ్యులు కూడా తమ ప్రేమని అంగీకరించడంతో ఇటీవలే వారు పెళ్లితో ఒక్కటైయ్యారు. ఇక నాలుగు గేదెల ను 40 గేదెలు చేసి.. వాటిని చూసుకోవడానికి ముగ్గురు పనివారిని కూడా పెట్టినట్లు సమాచారం. ఇక ఈ వీషయం తెలిసిన నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. “అమీర్ భాయ్ మీ దగ్గర మేం కొన్ని లవ్ టిప్స్ నేర్చుకోవాలి” అంటే.. మరికొందరు “నిజయితి ఎప్పుడూ గెలుస్తుంది.. మీ వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటున్నా” ఇక మీరు ఇప్పుడు పనోడు కాదు ఆ ఇంటికి యజమాని.. అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.