మహిళు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో వారి ప్రతిభను చాటుకుంటున్నారు. మగవాళ్లతో సమానం అన్ని విషయాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు.
ఈ మద్య మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారు. ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ భవనాన్ని కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు. పురుషులకు ఈ భవంతిలో అనుమతి లేదు. ఇలాంటి భవన నిర్మాణం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. యూకే లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేవలం స్త్రీల కోసం మాత్రమే 102 బహుళ అంతస్తు భవనం లండన్ లో నిర్మించబడుతోంది. ఇందులో పురుషులకు అనుమతి లేదని.. మహిళల కోసం మాత్రమే రూపొందిస్తున్నారని తెలుపుతున్నారు డబ్య్లూపీహెచ్. దీనిని 1902 లో ఓటింగ్ ఉద్యమంలో స్థాపించిన హౌసింగ్ అసోసియేషన్ నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాపర్టీ యజమాని ఉమెన్స్ పయనీర్ హౌసింగ్ ప్రతి అపార్ట్ మెంట్ ని మహిళల కోసమే రూపొందించామని తెలిపారు. దీనిని కేవలం మహిళలకు మాత్రమే అద్దెకు ఇస్తామని వెల్లడించారు. మోనోపాజ్ దాటిన వయసు మళ్లిన ఆడవాళ్లకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్ తోపాటుగా ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని తీర్చి దిద్దటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఈ ఫ్టాట్స్ కేవలం గృహ వేధింపులకు గురైన మహిళలకు, విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన ఒంటరి మహిళలకు, నల్లజాతి మహిళలకు, మైనారిటీ లేడీస్ కు మాత్రమే అద్దెకు ఇస్తారని డబ్య్లూపీహెచ్ స్పష్టం చేసింది. ట్రాన్స్ జెండర్స్ కు కూడా అద్దెకిస్తామని ప్రకటించారు.
ఈ అపార్ట్ మెంట్ కు మహిళలు మాత్రమే అద్దెదారులైతే వారి జీవిత భాగస్వామిగా ఉన్న పురుషుడు ఉండొచ్చు.. అలాగే ఒంటరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు కూడా ఈ భవనంలో ఉండవచ్చని వెల్లడించింది. ఈ బహుళ అంతస్తు నిర్మించుటకు కొందరు అంగీకరించకపోవడంతో దీనిపై కోర్టులో వివాదం నడుస్తున్నది. ఇందులో ఇంకో విశేషమేమంటే ఈ భవనం రూపొందిస్తున్న ఆర్కిటెక్ట్ కోలిన్ వీచ్ కూడా మహళనే. నేటి సమాజంలోఅనేక సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఈ బహుళ అంతస్తుల భవనం గృహవసతి కల్పిస్తుందని వీచ్ పేర్కొన్నారు. ఈ బహుళ అంతస్తు నిర్మాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.