బిజినెస్ డెస్క్- డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. కష్ట పడాలి, పని చెయ్యాలి.. అప్పుడే డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు కష్టపడకుండానే ఊరికే వస్తే. అదేంటీ డబ్బులు పనిచేయకుండా ఊరికే ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా.. ఐతే ఏ మాత్రం కష్టపడకుండా రెండు లక్షల రూపాయలు వచ్చే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. కేవలం ఒక్క ఎస్ఎంఎస్‌తో మీరు 2 లక్షల రూపాయలు దక్కించుకోవచ్చు.
అయితే ఇందుకు కొంత అదృష్టం కూడా ఉండాలి మంరి. మళ్లీ ఇదేం తిరకాసు.. అని అనుకుంటున్నారు కదా.. అసలు విషయం ఏంటంటే.. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. డీజిల్ భో ఇనామ్ జీతో పేరుతో ఇండియన్ ఆయిల్ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
ఐతే 18 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రమే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలి. ఇండియన్ ఆయిల్ రిటైల్ ఔట్‌లెట్స్‌లో కనీసం 25 లీటర్ల డీజిల్ కొనుగోలు చేస్తే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఒకేసారి 25 లీటర్ల డీజిల్ కొనాల్సి ఉంటుంది. డీజిల్ కొన్నాక అందుకు సంబందించిన బిల్లు తీసుకోవాలి. డీజిల్ కు సంబందించిన బిల్లు వివరాలను ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.
కంపెనీ ఇచ్చిన బిల్లులో బిల్ నెంబర్, డీలర్ కోడ్ ఉంటాయి. ఈ వివరాలను 7799033333 మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ముందు డీలర్ కోడ్, ఆ తరువాత స్పేస్ ఇచ్చి బిల్లు నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి క్వాంటిటీ ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. మొత్తం నలుగురు ఫైనల్ విజేతలను లక్కీ డ్రా ద్వార ఎంపిక చేసి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను అందిస్తారు. సో.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే డీజిల్ కొట్టించుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి.