భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించి చూసింది. రెండు రోజులు క్రితం డీఆర్‌డీఓ పినాకా రాకెట్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి ఏకంగా 25 అధునాతన పినాకా రాకెట్లను వరుస క్రమంలో ప్రయోగించగా వివిధ దూరాల్లో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని డీఆర్‌డీఓ తెలిపింది. అనుకున్నట్లుగానే అది లక్ష్యాన్ని ఛేదించడంతో డీఆర్డీవో వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. అగ్ని-4, అగ్ని-5 క్షిపణుల్లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్ని ప్రైమ్ కు రూపకల్పన చేశారు. అగ్ని-1 మిస్సైల్ కంటే ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది.
ప్రధానంగా అగ్ని ప్రైమ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టెక్నాలజీతో అగ్ని ప్రైమ్ క్షిపణిని నిర్మించారు. దీంతో దీని బరువు గత అగ్ని వెర్షన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అగ్ని-1 బలాస్టిక్ మిస్సైల్‌ను ఇండియాలో తొలిసారి 11989లో పరీక్షించారు. 2004లో ఆ క్షిపణులను వినియోగంలోకి తెచ్చారు. కాంపోసిట్ పదార్థాలతో రూపుదిద్దుకున్న ఈ మిసైల్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సునాయసంగా ధ్వంసం చేసే సామర్థ్యం ఈ మిసైల్ సొంతమని రక్షణ రంగ నిపుణులు తెలిపారు.