వివాహేతర సంబంధాలు మితిమీరిపోతున్నాయి. హాయిగా సాగుతున్న సంసార బంధాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. భర్త లేదంటే భార్య చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. ఇంకా చెప్పాలంటే వేరే వ్యక్తి మోజులో పడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రియుడి లేదా ప్రియురాలి కోసం కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడట్లేదు. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లయి పిల్లలున్న ఓ మహిళ, ప్రియుడి మైకంలో పడిపోయింది. భర్తకి తెలియకుండా అతడితో జాలీగా బైక్ రైడ్ కి వెళ్లింది. ఓ రోజు ఆమె బాగోతం బయటపడటంతో భర్త, ఆమెని ఫాలో అయ్యాడు. తీరా చూస్తే భార్య, భర్తకి అడ్డంగా దొరికిపోయింది. చివర్లో ప్రియుడి-భార్యని ఇద్దరు భర్త ఉతికారేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్స్ అయితే విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లయింది. వీళ్లకు ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నేళ్లుగా ఆ మహిళ.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకి తెలిసి, ఆమెని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సెప్టెంబరు 11న ఇంట్లో వాగ్వాదం జరగడంతో.. భర్త, కుమార్తెని వదిలేసి బయటకెళ్లిపోయింది. తీరా ఆమెని ఫాలో అవుతూ వెళ్తే.. మరో వ్యక్తితో కైలాష్ మందిర్ రోడ్డులో ఆమె బైక్ పై వెళ్తూ కనిపించింది.
దీంతో భర్త.. వారిద్దరినీ వెంబడించడంతో పాటు బండి ఆపమని గట్టిగా కేకలు వేశాడు. మరోవైపు ఆమె, తనని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి స్కార్ఫ్, గ్లాసెస్ ధరించింది. కేకలు వినిపించి ఆమె వెనక్కి చూడగా, భర్త-కుమార్తె బైక్ పై వెంబడిస్తూ కనిపించారు. దీంతో వీళ్లని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో భర్త.. వేగంగా వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. నడిరోడ్డుపై భార్యని, ప్రియుడిని చెప్పుతో చితకబాదాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. భార్య అడ్డంగా దొరికిపోవడం, భర్త చితకబాదడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Watch this
Man with his minor daughter chase his wife while she was on outing with her paramour. Man waylaid the duo & rained punches on his wife’s paramour. Police challaned paramour under CrPc 151.
Incident of #Agra, #UttarPradesh pic.twitter.com/3fXgKusAYd
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) September 12, 2022
ఇదీ చదవండి: దుబాయ్ లో భర్త, ప్రియుడితో రొమాన్స్ లో భార్య! క్లైమాక్స్ లో ఊహకందని సీన్!