వేసవికాలం రానే వచ్చింది. ఈ మండే ఎండలను తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను కొంటుంటారు. అయితే ముఖ్యంగా ఏసీలు కొనే సమయంలో మాత్రం చాలా మంది తప్పులు చేస్తుంటారు. వారికి ఎలాంటి ఏసీ కావాలో తెలియకుండానే ఏదొకటి కొనేస్తుంటారు. అందుకే మీకు అసలు ఎలాంటి ఏసీ కొనుగోలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి.
మండే వేసవిలో ఎవరైనా ఇంట్లో చల్లగా ఉండాలి అని కోరుకుంటారు. అందుకోసం కూలర్లు, ఏసీలు కొనుక్కుంటారు. కూలర్లు అంటే మీకు నచ్చిన రేటులో నచ్చిన వాటర్ కెపాసిటీతో కొనుగోలు చేయచ్చు. కానీ ఏసీలు అలా కాదు. అంత తేలిగ్గా మీరు ఏసీని కొనలేరు. ఎందుకంటే అందులో 1 టన్- 1.5 టన్- 2 టన్ అంటూ ఇలా చాలా రకాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాల కంపెనీలు, మోడల్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటిలో మీరు ఏ ఏసీని ఎంచుకోవాలో తేల్చుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. అందుకే ఇవ్వాళ ఏసీల్లో టన్ అంటే ఏంటి? మీ ఇంటికి ఏ ఏసీ అయితే బెటర్ అనే విషయాలను తెలుసుకుందాం.
సాధారణంగా గృహ అవసరాల కోసం అయితే ఏసీల్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. 1 టన్ అని, 1.5 టన్ అని, 2 టన్ అని అంటారు. ఏసీలో టన్ అంటే అది ఆ ఏసీ కెపాసిటీ అనమాట. ఆ ఏసీ ఎంత వరకు రూమ్ ని చల్ల బరచగలదు అనే చెప్పేదే ఈ టన్ లలో కొలుస్తారు. దాని కెపాసిటీని బ్రిటిష్ థర్మన్ యూనిట్స్(Btu/hr)లో కొలుస్తారు. ఒక టన్ ఏసీ అంటే దాని కెపాసిటీ 1200 Btu/hr ఉంటుంది. మీ రూమ్ స్పేస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా సందేహం ఉంటే.. మీ రూమ్ కొలతలను ఏసీ కొనే దగ్గర చెప్పినా కూడా వాళ్లు కూడా సజెస్ట్ చేసేందుకు వీలుంటుంది.
ఏసీ కొనే సమయంలో ఈ కెపాసిటీ అనేది చాలా అవసరం. మనకు ఎంత వరకు అవసరమో అంత కెపాసిటీలో ఏసీ కొనుగోలు చేయాలి. తక్కువ ఏసీ తీసుకుంటే మీ రూమ్ లో హీట్ స్పాట్స్ మిగిలిపోతాయి. అలాగని ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ తీసుకున్నారు అనుకోండి అప్పుడు.. దాని కెపాసిటీని బట్టే పవర్ కన్జప్షన్ ఉంటుంది. అంటే మీకు ఎక్కువగా కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇల్లు 8*10 స్పేస్ లో ఉండేటట్లైతే మీకు 1 టన్ ఏసీ సరిగ్గా సరిపోతుంది. అదేగనుక మీ ఇల్లు 10*12 కొలతల్లో ఉంటే గనుక 1.5 టన్ తీసుకోవడం ఉత్తమం. 1.5 టన్ తీసుకోవడం వల్ల మీ రూమ్ వెంటనే కూల్ అవుతుంది. ఎక్కడా కూడా హీట్ స్పాట్స్ ఉండే అవకాశం ఉండదు. అలాగే ఇన్వర్టర్ ఫ్రీ ఏసీలు కూడా వస్తున్నాయి. వాటిని తీసుకుంటే మంచి.
స్టార్ రేటింగ్ కూడా తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే స్టార్ రేటింగ్ ఆధారంగానే మీ ఏసీ పవర్ కన్జప్షన్ అనేది ఆధారపడుతుంది. ఇప్పట్లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఏసీని కంటిన్యూస్ వాడే వాళ్లకు బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ల తప్పకుండా 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీని తీసుకోవడం మంచిది. ముగ్గురు వ్యక్తులు ఉండే ఇంట్లో.. రోజుకు 4 నుంచి 6 గంటలు ఏసీని వాడే అవకాశం ఉంటే 3 స్టార్ ఏసీ కూడా సరిపోతుంది. కమర్షియల్ పర్పస్ తీసుకునే ఏసీలకు కూడా దాదాపుగా ఇలాంటి జాగ్రత్తలు సూట్ అవుతాయి. కానీ, వాటి కెపాసిటీ, స్పేస్, అవసరాన్ని బట్టి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ రూమ్ స్పేస్ ని దృష్టిలో ఉంచుకుని ఏసీని కొనుగోలు చేయాలి అని మాత్రం దృష్టిలో ఉంచుకోండి.