ఇంటర్నేషనల్ డెస్క్– నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. ఈ పాటే గుర్తుంది కదా. అల వైకుఠపురంలో సినిమాలో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే కాళ్లను చూస్తే మైమరిచిపోతాడు. పూజా హెగ్డే కాళ్లను చూసి మైమరిచి ఈ పాట పాడతాడు. ఇదిగో అచ్చు అలాగే టర్కీకి చెందిన ఓ యువతి కాళ్లను, ఆమె హైట్ ను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా రికార్డుల్లోకెక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా ప్రకటించింది. ప్రస్తుతం రుమేసా పొడవు 7 అడుగుల 0.7 ఇంచులు. అంటే 215.16 సెంటీమీటర్లు. వీవర్స్ సిండ్రోమ్ అనే అరుదైన జబ్బుతో రుమేసా బాధపుతోందని డాక్టర్లు చెప్పారు.
ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మత. దీంతో రుమేసా అసాధారంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంత భారీగా పెరగడంతో ఆమె నడవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. మరోవైపు అసాధారణ పొడవు వల్ల అనేక శారీరక సమస్యలతో బాధపడుతోంది రుమేసా. అందుకే ఇంట్లో తిరగాలన్నా, ఎక్కడికైనా బయటకు వెళ్లాలన్నా రుమేసా వీల్ చైర్ లేదా వాకింగ్ ఫ్రేమ్ సాయంతో నడుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రుమేసా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రుమేసా గురించి తెలిసిన చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే, మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించండి అని ఒకరు కామెంట్ చేయగా, గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ.. మరొకరు ఆమెకు దైర్యం చెబుతున్నారు.