అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక పాములతో ఆ కుటుంబాలు ఆడుకుంటాయి. సహజీవనం సాగిస్తాయి. ఇప్పటికీ కుమార్తెకు 21 పాములను కట్నంగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని గౌరియా సమాజ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
తన కుమార్తెకు వివాహంలో పాము ఇవ్వకపోతే ఆ వివాహం వీగిపోతుందని ఈ తెగ వారు సంప్రదాయం పాటిస్తున్నారు. పాములు పట్టుకునే జీవిస్తారు. గౌరియా సమాజంలోని ప్రజలు పాముల ద్వారా మాత్రమే డబ్బు సంపాదిస్తారు. ఈ తెగకు చెందిన పిల్లలు విషపూరిత పాములకు అస్సలు భయపడరు. వారు పట్టుకున్న పాము పారిపోయినా, చనిపోయినా కుటుంబంలో ఒకరు దూరం అయినట్టు బాధపడతారు కూడ. అంతేకాకుండా పాము పేరిట ఒక విందు కూడా నిర్వహించాలి. ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వీరు పాములకు ఎటువంటి హాని కలిగించరు.