తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. విషయం ఏంటంటే? ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. రాష్ట్రంలో ఏకంగా 79 ఎకరాల్లో పంట నీటమునిగింది. దీంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ గురువారం ఖమ్మ జిల్లాలోని బోనకల్ మండలం రామాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న, వరి, మామిడి పంటలను ఆయన పరిశీలించారు.
దీంతో నష్టపోయిన రైతులతో పాటు అధికారులతో సైతం సీఎం మాట్లాడి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక పర్యటన అనంతరం సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఏకంగా 79 వేల ఎకరాల్లో పంట నీటమునిగిందని అన్నారు. దీంతో మొక్కజొన్న, వరి, మామిడి పంటలు నష్టపోయిందని తెలిపారు. దీని కారణంగా నష్టపోయిన రైతులు నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.
పంట నష్టపరిహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు పంపలేదని, మా రైతులను మేమే కాపాడుకుంటామని అన్నారు. ఇక దీంతోపాటు మొట్టమొదటిసారిగా సహాయ పునరాలోచన చేపట్టి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ. 228 కోట్లను మంజూరు చేస్తామని, అంతేకాకుండా కౌలు రైతులను కూడా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ వార్తతో తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.