ముంబయి- టాలీవుడ్ టాప్ హీరోయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముంబయిలోని ఓ అపార్ట్ మెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు ఫ్లాట్ ఉంది. 12వ అంతస్థులో ఉన్న ఈ ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దీంతో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీ, తమిళ సినమాల్లో నటిస్తోంది. తెలుగులో రీసెంట్ గా ఆమె నటించిన కొండపొలం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరి వివాహం జరగనుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు పదేళ్లుగా రుకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించింది రకుల్. అన్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్ 45 అనే జిమ్ సెంటర్‌ను కూడా రన్ చేస్తోంది. అంతే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తన ఫిట్ నెస్ రహస్యాలు, యోగ ప్రత్యేకత గురించి చెబుతుంటుంది రకుల్.