సంగారెడ్డి- ఆడపిల్లకు సమాజంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. బయటకెళ్తే మృగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉందని భయపడితే, ఇంట్లో కూడా ఆమెకు ప్రమాదం పొంచి ఉందని చాలా సందర్బాల్లో నిరూపితమైంది. తాజాగా వావి వారసలు లేకుండా కొంత మంది తమ కామ వాంఛ కోసం చలరేగిపోతున్నారు. తాజాగా సంగారెడ్డిలో జరిగిన అమానుష ఘటన అందరిని కలవరపెడుతోంది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి పాల్పడ్డాడు. వద్దు నాన్నా అని చేతులు జోడించి వేడుకుంటున్నా ఆ కామాంధుడు కూతురి జీవితాన్ని బలి తీసుకున్నాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లో చోటుచేసుకుంది. 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఈ క్రమంలో రాఖీ పండుగ నేపధ్యంలో అతని భార్య తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఇద్దరు కూతుళ్లు, కొడుకులను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. పద్నాలుగేళ్ల కూతురు ఇంటి వద్దే ఉంది. ఎప్పటి నుంచో కూతురిపై తప్పుడు ఆలోచనతో ఉన్న ఆమె తండ్రి అదును చూసి నీచానికి పాల్పడ్డాడు. కన్న కూతురు అనే కనికరం లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. వద్దు నాన్నా, నీ కన్న కూతురుని అని ఆమె ఎంత వేడుకుంటున్నా కనికరించేదా కసాయి తండ్రి.
బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను చేసిన ఈ నిచమైన పని గురించి ఎవరికైనా చెబితే తల్లిని, అక్కలని చంపేస్తానని ఆ నీచుడు బెదిరించాడు. పట్టింటికి వెళ్లిన తల్లి రాగానే తండ్రి చేసిన దారుణాన్ని చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.