రైతులు.. మట్టి వాసన, కష్టం తప్పా ఏం తెలియని మనుషులు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న చివరికి చేసిన అప్పులు తీర్చలేక ఉరితాడుకు వేలాడుతారు. ఇది దేశంలో ఉన్న రైతుల పరిస్థితి. కానీ అలాంటి రైతులు కష్టాలు, బాధలు మరిచిపోయేందుకు క్రీడల్లో పాల్గొనడం ఎప్పుడైన చూశారా? అది కూడా గ్రౌండ్ లోకి దిగి బ్యాటు పట్టి క్రికెట్ ఆడడం. వినటానికి వింతగా ఉన్న ఇది నిజం. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంటు లో స్థానిక రైతులు పాల్గొని మేము కూడా క్రికెట్ ఆడగలమంటూ నిరూపించారు.
జిల్లాలోని బోథ్‌లోని లాల్‌పిచ్ మైదానంలో ఆదివారం ఎస్ఎస్ టీమ్ తో రైతన్నల టీమ్ పోటీపడింది. అయితే హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి రైతన్నల టీమ్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక అనంతరం కొంతమంది రైతులు మాట్లాడుతూ.. రైతులను చులకనగా చూస్తున్నారని, మేము కూడా ఆటలు ఎందుకు ఆడొద్దని రైతులం కలిసికట్టుగా క్రికెట్ ఆడామని తెలిపారు. ఆటలో ఓడిపోయిన మేము ఎంతో గర్వంగా ఫీలవుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఓడిపోయినా వచ్చే టోర్నమెంట్ లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పొలంలో నాగలి పట్టిన రైతులే నేడు పంచె ఎగ్గట్టి గ్రౌండ్ లో క్రికెట్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
క్రికెట్ ఆడిన రైతన్నలు -V6 News#Farmers #PlayingCricket #Adilabad #V6 #V6Velugu #V6News pic.twitter.com/nvSTD2IJ5v
— V6 News (@V6News) January 10, 2022