టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా, నిరూపించుకోవడానికి అవకాశాలు రాక క్రికెట్ కు దూరమైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. పోనీ, అప్పటి పరిస్థితులు వేరు కదా అందామా! ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఓ యువ క్రికెటర్ ఎదుర్కొంటున్నాడు. అతగాడు ఎవరో కాదు.. సంజూ శాంసన్. అప్పుడెప్పుడో 7 ఏళ్ల క్రితం టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఆడింది 16 మ్యాచులే. ఆసియా కప్ 2022 టోర్నీలో రిషబ్ పంత్ విఫలమవడంతో ఈ పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది.
వన్డేలు, టెస్టుల్లో అదరగొడుతున్న పంత్ టీ20ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కనీసం 30 పరుగులు చేసి ఇన్నింగ్స్ లు అయ్యిందో. 14, 17.. ఆసియా కప్ టోర్నీలో పంత్ చేసిన స్కోర్లు. ఈ తరుణంలో టీ20ల నుంచి పంత్ ను తప్పించి శాంసన్ కు అవకాశాలివ్వాలంటూ నెటిజనులు సూచిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం లేదు. ఆసియా కప్ 2022 రిజల్ట్ చూశాకైన సరైన నిర్ణయాలు తీసుకోండి లేదంటే మరోసారి భంగపాటు తప్పదు అని క్రికెట్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
India needs him for T20. 😑
Sanju samson #INDvsSL pic.twitter.com/XRtslKcoLN— Dhriti banerjee (@dhriti908) September 6, 2022
2015 జులైలో జింబాబ్వేతో అంతర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేసిన శాంసన్.. ఈ ఏడేళ్లలో ఆడింది 16 మ్యాచులే. ఏదో పంత్‌కు రెస్ట్ ఇచ్చినపుడు కొన్ని అవకాశాలిచ్చినా, కీలక మ్యాచుల్లో బెంచ్ కే పరిమవుతున్నాడు. గతేడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటికే 25 టీ20లు ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు. శాంసన్ కు ఎన్ని అవకాశాలిస్తున్నారా? అన్నది. కీలక ఇన్నింగ్స్ లు ఆడటమే కాదు.. చిరుతలా కదులుతూ స్టంపౌట్లు, రనౌట్లు చేయడంలో కూడా శాంసన్, పంత్ కంటే చాలా బెటర్. అందుకే.. టీ20 ప్రపంచ కప్ కు అతనికి మరిన్ని అవకాశాలివ్వనేది క్రీడా ప్రేమికుల వాదన. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Proud of you our chetta Sanju Samson 💎 pic.twitter.com/eftBJsOuOx
— Registanroyals (@registanroyals) September 6, 2022