‘గుండెకు సవ్వడెందుకో, పెదవులకు వణుకెందుకో’అంటూ ప్రేమించిన వ్యక్తి కోసం పాట పాడుకున్న అమ్మాయి, ‘ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటి అర్థం చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత’అంటూ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మహిళగా మెప్పించింది నటి అశ్విని
మధ్య తరగతి మానవుడు టీవీ అంటే క్రేజ్, స్టేటస్ సింబల్‌గా భావించే రోజుల్లో కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉండేది. అందులో టెలీఫిల్మ్స్ వచ్చేవి. ఆ తర్వాత ధారావాహికలు మొదలయ్యాయి. అందులో బాగా పేరు తెచ్చుకున్నది రుతు రాగాలు. ఈ సీరియల్ కోసం ఎంతలా పరితపించిపోయేవారంటే.. ఆ టైం కల్లా పనులు పూర్తి చేసుకుని ఠంచనుగా టీవీల ముందు వాలిపోయేవారు. ఆ తర్వాత ఈటీవీ నెట్ వర్క్ వచ్చి.. బుల్లితెర దిశను, దశను మార్చేసింది. అందులో పొద్దున్నంతా ఈనాడు సరాగాలు అంటూ పాటలు వేస్తూ.. సాయంత్రం నుండి సీరియల్స్, ఇతర ఎంటర్‍టైమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఇప్పట్లో అంటే అర్థం పర్థం లేని సీరియల్స్ చూసి టైంపాస్ చేసేస్తున్నారు మహిళలు. ఒకప్పటి సీరియల్స్ అంటే ఒక తియ్యటి జ్ఞాపకంగా మారిపోయాయి. అంతలా అవి ప్రభావితం చూపాయి. ఆ సీరియల్స్ లో అంతరంగాలు, వసుంధర ఎపిసోడ్లు ఉంటాయి.
‘గుండెకు సవ్వడెందుకో, పెదవులకు వణుకెందుకో’అంటూ ప్రేమించిన వ్యక్తి కోసం పాట పాడుకున్న అమ్మాయి, ‘ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటి అర్థం చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత’అంటూ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మహిళగా మెప్పించింది నటి అశ్విని. ఈ రెండు సీరియల్స్ లో ఆమె ఏడుస్తూ.. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేది. దీంతో ఆమెకు ఏడుపుగొట్టు సీరియల్ హీరోయిన్ అని ముద్ర పడిపోయింది. ఈ రెండు సీరియల్స్‌లో ఆమెకు ఎనలేని పేరు వచ్చింది. ఆమెకు చాలా మంది మహిళలు ఫ్యాన్స్ అయిపోయేవారు. ఆమెకు బాధ వస్తే తమ ఇంట్లో అమ్మాయికి కష్టమొచ్చినట్లు ఫీల్ అయ్యేవారు. అంతలా ఆమె తన నటనతో కట్టిపడేశారు. సీరియల్స్‌లోనే కాదూ ఆమె పలు సినిమాల్లో కూడా నటించారు. కొత్త వాళ్లు రావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలో సీరియల్స్, సినిమాలు చేశారు. అయితే కొన్నాళ్ల నుండి ఆమె తెలుగులో మళ్లీ కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె ఎలా ఉంది. ఏం చేస్తుందీ అని చాలా మంది తెలుసుకోవాలని నెట్టింట్ల సెర్చ్ చేస్తున్నారు.
అశ్విని కనిపించడానికి తెలుగు అమ్మాయిలా ఉంటుంది కానీ.. ఆమె తమిళనాడులో మలయాళ కుటుంబంలో జన్మించింది. తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అశ్వినికి రుద్ర, అశ్విత అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమె పూర్తి పేరు అశ్విని నంబియార్. ఆ తర్వాత మలయాళ, తమిళంలో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇక తెలుగులో సీరియల్స్ చేస్తూనే.. సినిమాలు చేసింది. హిట్లర్ సినిమాలో చిరంజీవి పెద్ద చెల్లెలుగా కనిపించిందీ ఈమెనే. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, గణపతి, పోలీస్ వంటి చిత్రాల్లో కనిపించింది.అమ్మకానికో అమ్మ, చిన్నితల్లి, అక్కా చెల్లెళ్లు, అగ్నిగుండం వంటి సీరియల్స్ లో కనిపించి అలరించి, ఆ తర్వాత తమిళ సీరియల్స్‌పై ఫోకస్ పెంచారు. పెళ్లి చేసుకున్నాక కూడా తమిళ సీరియల్స్‌లోనే ఆమె ఎక్కువ కనిపిస్తున్నారు. ఆమెను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇసుమంతైనా అందం తగ్గలేదు సరికదా.. ఫిజిక్ కూడా అలాగే మెయిన్‌టైన్ చేస్తున్నారు. సింగపూర్ లో సెటిలైనట్లు తెలుస్తోంది కానీ.. ఆమె తమిళ సీరియల్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నట్లు సమాచారం. తర్వలో ఆమె కూడా తెలుగు తెరపై కనిపిస్తారేమో చూడాలి. ఆమె పేరు చెబితే మీకు గుర్తుకు వచ్చే సీరియల్ ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.