ఇంటర్నేషనల్ డెస్క్- కోడి.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరించే కోడి కూర గుర్తుకు వస్తుంది కదా. మరి కొందరికైతే సంక్రాంతి సందర్బంగా ఆడే కోడు పందేలు కూడా గుర్తుకు రావచ్చనుకొండి. ఇవన్ని పకన్నపెడితే.. సాధారణంగా కోడి నేల మీద మాత్రమే తిరుగుతుంది. చాలా తక్కువ సందర్బాల్లో కొన్ని క్షణాల పాటు, అదీ కొంత ఎత్తుకు మాత్రమే ఎగురుతుంది కోడి.
అయితే తాజాగా ఓ కోడికి సంబందించిన వార్త సోషల్ మిడియాలో హల్‌చల్ చేస్తోంది. కోడి నేల మీదే కాకుండా గాల్లో పక్షిలా తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే యూజర్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు.
కోడి ఇంత దూరం విహరిస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు.. అనే క్యాప్షన్ తో అతను షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మంచు ప్రాంతంలో కోడి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరింది. సుమారు 40 సెకన్ల పాటు ఆ కోడు వందల మీటర్ల వరకూ గాల్లోనే ఎగురుతూ చివరికి ఓ చోట ల్యాండ్ అయ్యింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైక్స్ వస్తున్నాయి.
కోడి మామూలు పక్షిలా అలా గాల్లోకి ఎగరడం చూసిన నెటిజన్లు అసలు ఇది నిజంగా కోడేనా, లేక కోడిలా కనిపిస్తోన్న వేరే జాతి పక్షా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇది ఖచ్చితంగా కోడి అని వీడియో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే కోళ్లలో ఇదో రకం కోడి అని చెప్పుకోవాలి మరి.
Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6
— Buitengebieden (@buitengebieden_) January 29, 2022